ఒకే ఒక్క సినిమా స్టార్ ప్రొడ్యూసర్ తో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ కు చుక్కలు చూపిస్తోంది. ముందు కు వెళ్లాలా? లఏక వెనక్కి వెళ్లాలా? అనేది తేల్చుకోకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం `బీస్ట్`. తమిళ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడక్షన్ కంపనీ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు.
భారీ అంచనాల మధ్య తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ ఏప్రిల్ 13న అత్యధిక థియేటర్లలో విడుదలైంది. రొటీన్ కథ కావడం.. విజయ్ స్థాయి స్టార్ హీరో చేయదగ్గ సినిమా కాకపోవడంతో ఈ చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. సినిమా ఆశించిన స్థాయిలొ లేకపోవడంతో విజయ్ అభిమానులు ఆగ్రహంతో ఓ థియేటర్ కు నిప్పు పెట్టారు. దీంతో `బీస్ట్` చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రాన్ని తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేశారు.
భారీ అంచనాలు పెట్టుకుని రిలీజ్ చేసిన ఈ మూవీ దిల్ రాజు కు భారీ నష్టాలని మిగిల్చింది. ఇదే సమయంలో విజయ్ హీరోగా తమిళంలో వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ఓ భారీ సినిమాకు ఇటీవల శ్రీకారం చుట్టారు. `బీస్ట్` ఫలితంతో విజయ్ తో చేస్తున్న సినిమా విషయంలో దిల్ రాజు ఇప్పడు టెన్షన్ పడుతున్నారట. తెలుగులో విజయ్ కి ఇప్పుడిప్పుడే మార్కెట్ పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో `బీస్ట్` ఫ్లాప్ కావడంతో టెన్షన్ పడుతున్నారట. ఇదిలా వుంటే ఈ సినిమా ఫలితం సూపర్ స్టార్ రజనీకాంత్ ని కూడా టెన్షన్ పెడుతోందని చెబుతున్నారు. ఇలా ఒకే సమయంలో ఎలాంటి సంబంధం లేని ఇద్దరిని `బీస్ట్` మూవీ టెన్షన్ పెడుతుండటం హాట్ టాపిక్ గా మారింది.
దిల్ రాజు భారీ మొత్తం వెచ్చించయి `బీస్ట్`ని రిలీజ్ చేశాడు.. ఈ మూవీ తరువాత విజయ్ తో సినిమా తీస్తున్నాడు కాబట్టి టెన్షన్.. మరి రజనీకి ఎందుకు టెన్షన్ అనుకుంటున్నారా? .. రజనీకి `బీస్ట్` కి లింక్ వుంది. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన నెల్సన్ దిలీప్ కుమార్ త్వరలో రజనీకాంత్ నటించనున్న 169వ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని కూడా సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించబోతోంది. ఇదే ఇప్పడు వరుస ఫ్లాపుల్లో వున్న రజనీని టెన్షన్ పెడుతోంది.
`రోబో` తరువాత రజనీ ఇంత వరకు ఆస్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేకపోయారు. `లింగా` నుంచి అన్నాత్తే వరకు రజనీ వరుస ఫ్లాపులని చవి చూస్తున్నారు. ఈ దశలో ఆయనకు బ్లాక్ బస్టర్ అవసరం. మిగతా హీరోలంతా బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ లని, బ్లాక్ బస్టర్ లని అందిస్తున్నారు. ఈ దశలో తను కూడా బ్లాక్ బస్టర్ హిట్ ని అందించి మళ్లీ ట్రాక్ లోకి రావాలనుకుంటున్నారు.
`బీస్ట్`తో ఫ్లాప్ ని సొంతం చేసుకుని స్టార్ హీరోని హ్యాండిల్ చేయలేడనే విమర్శలు ఎదుర్కొంటున్న నెల్సన్ దిలీప్ కుమార్ ని తప్పించి ఆ స్థానంలో మరో టాలెంటెడ్ డైరెక్టర్ ని తీసుకుంటే మంచిదనే అభిప్రాయాన్ని రజనీ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రజనీ ఎలా స్పందిస్తాడో.. నిర్మాత కళానిధి మారన్ స్పందన ఏంటన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.