'సర్కార్‌' కు ఒకే ఏరియాలో రెండు ఫలితాలా?

Update: 2018-11-22 12:06 GMT
విజయ్‌ - మురుగదాస్‌ ల కాంబినేషన్‌ లో తెరకెక్కిన ‘సర్కార్‌’ చిత్రం దాదాపుగా 250 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ ను వసూళ్లు చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా కూడా వివాదం కలిసి రావడంతో పాటు - బాక్సాఫీస్‌ వద్ద మరే సినిమా పోటీ లేకపోవడం వల్ల అన్ని ఏరియాల్లో కూడా మంచి వసూళ్లు నమోదు అయ్యాయి అంటూ నిర్మాతలు ప్రకటించారు. అయితే అందుకు విభిన్నంగా చెన్నై ఏరియాలో సినిమాను పంపిణీ చేసిన జీకే సినిమాస్‌ సంస్థ యజమాని ఒకరు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా వల్ల తాము భారీగా నష్టపోయాం అంటూ ప్రకటించాడు.

జెయవీరన్‌ అనే ఆ డిస్ట్రిబ్యూటర్‌ తాము పెట్టిన పెట్టుబడి రాలేదని - సన్‌ పిక్చర్స్‌ వారు మా నష్టాలను పూడ్చుతామని హామీ ఇచ్చారని చెప్పుకొచ్చాడు. మొదటి మూడు నాలుగు రోజుల తర్వాత కలెక్షన్స్‌ దారుణంగా పడిపోయాయని, దాంతో మేము నష్ట పోయామని - ఇంకా ఎంతో మంది కూడా నష్టపోయారని ఆయన అన్నాడు. అయితే జెయవీరన్‌ వ్యాఖ్యలను జీకే సినిమాస్‌ సంస్థ సహ యాజమాని రుబన్‌ మాతివనన్‌ కొట్టి పారేస్తున్నాడు.

మేము చెన్నైలో పంపిణీ చేసిన సర్కార్‌ చిత్రం మంచి లాభాలను తెచ్చి పెట్టిందని రుబన్‌ అంటున్నాడు. తన భాగస్వామి జెయవీరన్‌ కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడేమో అంటూ అనుమానం వ్యక్తం చేశాడు. ఒకే సంస్థకు చెందిన వీరిద్దరి వాదనలు విభిన్నంగా ఉండటంతో ఇప్పుడు తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.

Tags:    

Similar News