ఓవర్సీస్.. గత కొన్నేళ్లలో తెలుగు సినిమాలకు చాలా పెద్ద మార్కెట్ గా మారింది. ఐతే అక్కడ ఏ సినిమా పడితే ఆ సినిమా ఆడేయదు. అక్కడ మంచి కలెక్షన్లు సాధించాలంటే కొన్ని లెక్కలుంటాయి. సినిమాలు క్లాస్ గా ఉండాలి. ఫ్యామిలీ ఎమోషన్లకు ప్రాధాన్యమివ్వాలి. సున్నితమైన హాస్యం ఉండాలి.. ఇలాంటి సినిమాలకే పట్టం కడతారు యుఎస్ ఆడియన్స్. ‘బాహుబలి’ని మినహాయిస్తే ఈ తరహా సినిమాలే అక్కడ రాజ్యమేలుతాయి. నాని చిన్న హీరో అయినా సరే ‘భలే భలే మగాడివోయ్’ ఒకటిన్నర మిలియన్ డాలర్ల దాకా వసూలు చేసిందంటే.. అక్కడి ఆడియన్స్ టేస్టు ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్ కొత్త సినిమా ‘ఊపిరి’ కూడా యుఎస్ ఆడియన్స్ టేస్టుకు తగ్గట్లు ఉండటంతో దీనికి అక్కడ మంచి స్పందనే వస్తోంది.
రిలీజ్ కు ముందు రోజు ప్రిమియర్స్ తోనే ‘ఊపిరి’ 76,805 డాలర్లు వసూలు చేయడం విశేషం. అంటే మన రూపాయల్లో రూ.51.39 లక్షలన్నమాట. మొత్తం 74 లొకేషన్ లలో ‘ఊపిరి’ని రిలీజ్ చేసింది పీవీపీ సంస్థ. ‘బ్యాట్ మ్యాన్ వెర్సస్ సూపర్ మ్యాన్’ సినిమా భారీ స్థాయిలో రిలీజైనప్పటికీ ఆ పోటీని తట్టుకుని మన సినిమా మంచి వసూళ్లే సాధించింది యుఎస్ లో. సినిమాకు చాలా మంచి టాక్.. పాజిటివ్ రివ్యూలు కూడా వచ్చిన నేపథ్యంలో కలెక్షన్లు భారీగా ఉంటాయిని ఆశిస్తున్నారు. తొలి వీకెండ్ లోనే పెట్టుబడి అంతా వెనక్కి వచ్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘ఊపిరి’ యుఎస్ రైట్స్ రూ.3 కోట్లకు అమ్మింది పీవీపీ సంస్థ. ఇప్పటిదాకా నాగార్జున సినిమాల్లో ‘మనం’ అత్యధికంగా 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. రెండు వారాల వరకు పెద్ద సినిమా లేదు కాబట్టి.. ఊపిరి కలెక్షన్లు స్టడీగా ఉంటే ఆ మార్కును దాటేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.