దీపావళి సందర్భంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఏకంగా నాలుగు సినిమాలు వచ్చాయి. అందులో విశ్వక్ సేన్ హీరోగా విక్టరీ వెంకటేష్ కీలక గెస్ట్ రోల్ లో నటించిన ఓరి దేవుడా సినిమా ఒకటి. ఈ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ ఓమై కడవలే కి రీమేక్ అనే విషయం తెల్సిందే.
అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా తెలుగు లో కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంతా భావించారు. పెద్దగా మార్పులు చేయకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా చిన్న చిన్న మార్పులతో ఓరి దేవుడా సినిమా ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
సినిమా ఎంటర్ టైన్‌మెంట్ పరంగా ఆకట్టుకుంది.. అంతే కాకుండా వెంకటేష్ యొక్క పాత్ర మరియు విశ్వక్ సేన్ మరియు వెంకటేష్ మధ్య ఉండే సన్నివేశాలు చాలా విభిన్నంగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయంటూ రివ్యూలు వచ్చాయి. ఓవరాల్ గా సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.. ప్రేక్షకుల నుండి కూడా పర్వాలేదు అన్నట్లుగానే టాక్ వచ్చింది.
సినిమాకు ఇలాంటి టాక్ వచ్చిన నేపథ్యంలో తప్పకుండా మంచి కలెక్షన్స్ నమోదు అయ్యే అవకాశం ఉందని అంతా భావించారు. కాని సినిమాకు కలెక్షన్స్ వచ్చిన టాక్ కు తగ్గట్లుగా లేవు అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. సినిమా బాగానే ఉందని టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం రాకపోవడం విడ్డూరంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.
లాంగ్ వీకెండ్ కారణంగా సినిమా కి కలిసి వస్తుందని అంతా భావించారు. కానీ పరిస్థితి చూస్తే రివర్స్ అయ్యింది. ఏమాత్రం ఆశాజనకమైన కలెక్షన్స్ నమోదు అవ్వక పోవడంతో చిత్ర యూనిట్ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట.
సినిమా కు సరైన ప్రమోషన్ చేయక పోవడం వల్ల ఈ పరిస్థితి అంటూ కొందరు అంటూ ఉంటే మరి కొందరు విశ్వక్ సేన్ యొక్క ఇమేజ్ కారణంగా ఆయన సినిమా ను జనాలు థియేటర్లలో చూసేందుకు రావడం లేదేమో అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నేడు దీపావళి సందర్భంగా అయినా ఈ సినిమా కలెక్షన్స్ పెరుగుతాయేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.