అస్కార్ల పంట పండిస్తోన్నమ్యాడ్ మ్యాక్స్; ప్యూరీ రోడ్

Update: 2016-02-29 04:34 GMT
ప్రపంచ సినిమాకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే హాలీవుడ్ తో పాటు.. ప్రపంచ సినీ పరిశ్రమలు.. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అస్కార్ పండగ మొదలైంది. 88వ అస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్ లో అత్యంత వేడుకగా సాగుతోంది. ప్రముఖ హాలీవుడ్ తారాగణంతో పాటు.. పలువురు ప్రముఖులతో సందడిగా మారింది.

ఇప్పటివరకూ పలు అవార్డులు ప్రకటించగా.. మ్యాడ్ మ్యాక్స్; ప్యూరీ రోడ్ అత్యధికంగా అవార్డుల్ని సొంతం చేసుకుంది. మొత్తం 10 అస్కార్ నామినేషన్లు పొందిన ఈ చిత్రం ఇప్పటివరకూ ఆరు అస్కార్ అవార్డుల్ని సొంతం చేసుకోవటం గమనార్హం. ఉత్తమ ఎడిటింగ్.. కాస్టూమ్ డిజైనింగ్.. ప్రొడక్షన్ డిజైనింగ్.. మేకప్.. హెయిర్ డ్రెస్సింగ్.. సౌండ్ ఎడిటింగ్.. సౌండ్ మిక్సింగ్ విభాగాల్లో అస్కార్ అవార్డుల్ని కొల్లగొట్టింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మ్యాడ్ మ్యాక్స్ కంటే ఎక్కువ నామినేషన్లను దక్కించుకున్న ‘‘ద రెవెనంట్’’ (12 విభాగాలకు నామినేట్ అయ్యింది) ఇప్పటివరకూ ఒక్క అస్కార్ ను మాత్రమే సొంతం చేసుకోవటం గమనార్హం.
Tags:    

Similar News