కింగ్ నాగార్జున సక్సెస్ కోసం చాలా పాట్లు పడుతున్నారు. చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్న నేపథ్యంలో నాగ్ విభిన్నమైన సినిమాలను చేయాలనే ఉద్దేశ్యంతో సాల్మన్ రాజ్ దర్శకత్వంలో వైల్డ్ డాగ్ అనే సినిమాను మొదలు పెట్టాడు. గతంలో వచ్చిన గగనం సినిమా తరహాలో ఇది ఉంటుందని అన్నారు. ఆ సినిమాతో నాగ్ కు మంచి మార్కులు పడ్డాయి. కనుక ఈ సినిమతో కూడా తప్పకుండా సక్సెస్ అందుకుంటాను అనే నమ్మకంను నాగ్ వ్యక్తం చేశాడు. అయితే ఓటీటీ వారు మాత్రం ఈ సినిమాను నాగ్ ఎలా చేశారు అంటూ పెదవి విరుస్తున్నారట.
వైల్డ్ డాగ్ షూటింగ్ కరోనా కారణంగా నిలిచి పోయింది. బ్యాలన్స్ వర్క్ ను త్వరలో పూర్తి చేసి ఓటీటీ లో విడుదల చేయాలని భావించారు. ఓటీటీ వారు ఈ సినిమా విషయంలో ఆసక్తిగా లేరంటూ టాక్ వినిపిస్తుంది. అతి తక్కువ రేటుకు కోట్ చేస్తున్న కారణంగా నిర్మాతలు ఆ రేటుకు ఇవ్వడం కుదరని చెప్పారట. బడ్జెట్ కూడా రికవరీ అవ్వకుండా తక్కువ రేటుకు అడుగుతుండటంతో నిర్మాతలు ఇక థియేటర్ రిలీజ్ కు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారట.
నాగార్జున అంటే ప్రేక్షకులు ఎంటర్ టైన్ మెంట్ ను ఆశిస్తారు. కాని ఈ సినిమా ముంబయి దాడుల నేపథ్యంలో ఉంటుందట. ఇందులో నాగ్ ఎన్ ఐ ఏ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే సినిమా పై జనాల్లో ఆసక్తి లేదు. పైగా ఇది ప్రయోగాత్మక సినిమా అవ్వడం వల్ల సినిమాను ప్రేక్షకులు చూడక పోవచ్చు అంటున్నారు. అందుకే ఓటీటీ వారు ఆసక్తి చూపడం లేదు అనే టాక్ వినిపిస్తుంది.