ఆ పాన్ ఇండియా మూవీ 'ఓటిటి'లో రిలీజ్ కానుందా?

Update: 2020-05-06 01:30 GMT
దేశంలో లాక్ డౌన్ కారణంగా గత నెల రోజులుగా విడుదల కావల్సిన సినిమాలన్ని వాయిదా పడ్డాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే మరో నెల వరకు థియేటర్లు తెరుచుకునే అవకాశమే లేదు. జనాలు కూడా లాక్ డౌన్ వల్ల ఓటిటి లకు బాగా అలవాటు పడ్డారు. ఈ అవకాశాలను క్యాష్ చేసుకునేందుకు అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటిటి సంస్థలు మీడియం రేంజ్ సినిమాల హక్కులను సొంతం చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను కొనుక్కొని థియేటర్లో కాకుండా డైరెక్ట్ గా ఓటిటి లో విడుదల చేయాలని నిర్మాతల వెంటపడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా కూడా చేరింది. ఇటీవలే ఈ సినిమా డైరెక్ట్ గా విడుదల కానుందని వార్తలు వచ్చాయి.. అయితే ఆ వార్తలు నిజం కాదని నిర్మాతలు కొట్టిపారేశారు.

అయితే అమెజాన్ ప్రైమ్ అన్ని భాషలకు గాను నిశ్శబ్దం సినిమా హక్కులను భారీ రేటుకు సొంతం చేసుకుందట. ఇక నేరుగా డిజిటల్ రిలీజ్ చేసేందుకు ప్రైమ్ సిద్దమవుతుందని టాక్. నిర్మాతలకు కూడా ఈ విషయంలో ఓకే అన్నట్లే ఉన్నారట. అయితే అనుష్క ఒప్పుకుంటేనే సినిమా డైరెక్ట్ గా ప్రైమ్ లోకి రానుంది. మరి ఇందుకు అనుష్క ఓకే చెపుతుందో లేదో చూడాలి. హేమంత్ మధుకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అనుష్కతో పాటు మాధవన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రలు పోషించారు. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ సినిమాను కోన వెంకట్, టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఇదిలా ఉండగా ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. చూడాలి మరి కొత్తగా ఏమైనా అప్డేట్స్ వస్తాయేమో..
Tags:    

Similar News