ఓటీటీ సినిమాల జాతర.. ప్రేక్షకులకు పండగే

Update: 2022-05-04 02:30 GMT
కరోనా సమయంలో ఇండియాలో ఓటీటీ మార్కెట్‌ విపరీతంగా పెరిగింది. దాదాపు ఏడాది పాటు థియేటర్ లు పూర్తిగా ఆ సమయంలో మూసి ఉన్నాయి. దాంతో ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ ని ఆశ్రయించారు. అక్కడ ప్రేక్షకులకు థియేటర్ లో కంటే ఎక్కువ ఎంటర్‌ టైన్‌మెంట్‌ దక్కింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎంటర్ టైన్‌మెంట్‌ దక్కడంతో ఓటీటీ మార్కెట్‌ ఇండియాలో భారీగా పెరిగింది.

థియేటర్లు మళ్లీ యధాతధంగా రన్ అవుతున్నా కూడా ఓటీటీ మార్కెట్‌ ఏమాత్రం తగ్గలేదు. ఒక సారి అలవాటు పడిన వారు ఓటీటీ ని వదలడం లేదు. ప్రేక్షకులు ఓటీటీ ని ఆధరిస్తున్న దరిమిలా ప్రతి వారం థియేటర్‌ రిలీజ్ లకు ఏమాత్రం తగ్గకుండా ఓటీటీ రిలీజ్ కూడా అవుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రతి వారం స్ట్రీమింగ్‌ అవుతున్నట్లుగానే ఓటీటీ లో ఈ వారం కూడా పలు డైరెక్ట్‌ రిలీజ్ సినిమాలు మరియు థియేటర్‌ రిలీజ్ అయిన సినిమాలు స్ట్రీమింగ్‌ కు సిద్దం అయ్యాయి.

ఈ వారం హిందీ సినిమా ప్రేక్షకులకు ఓటీటీ సినిమాల జాతర. వరుసగా పెద్ద చిన్న సినిమాలు చాలా వరకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. పలు క్రేజీ సినిమాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ వారం సినీ ప్రేమికులకు ప్రేక్షకులకు పండగే. రాధేశ్యామ్‌ హిందీ వర్షన్ కోసం వెయిట్‌ చేస్తున్న ఉత్తరాది ప్రేక్షకులకు ఈ వారం ఆ ఎదురు చూపులకు బ్రేక్ పడబోతుంది.

ఇంకా హిందీలో తెరకెక్కిన హోం శాంతి అనే వెబ్‌ సిరీస్‌.. స్టోరీస్ ఆఫ్ ది నెక్ట్స్‌ పేజ్‌ వెబ్‌ సిరీస్ లు డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో మే6వ తారీకు నుండి స్ట్రీమింగ్‌ అవ్వబోతున్నాయి. ఝుండ్ హిందీ సినిమా కూడా మే 6వ తారీఖున జీ 5 లో స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది. కన్నడ చిత్రం మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ మే 5వ తారీకున అమెజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్‌ కు సిద్దంగా ఉంది.

ది వైల్డ్‌ అనే వెబ్‌ సిరీస్ రెండవ సీజన్ కూడా అమెజాన్ లో ఈ వారం స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది. థార్ హిందీ సినిమా ను ఈ వారం లోనే స్ట్రీమింగ్ కు సిద్ధం చేశారు. 40 ఇయర్స్ యంగ్‌ ను మే 4వ తారీకు నుండి నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రిమింగ్‌ చేయబోతున్నారు. మొత్తానికి ఈ వారంలో ప్రతి ఒక్క ప్రముఖ ఓటీటీ కూడా ప్రేక్షకుల ముందుకు పెద్ద ఎత్తున సినిమా లను మరియు సిరీస్ లను తీసుకు రాబోతున్నారు
Tags:    

Similar News