కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంటికే పరిమితమైన జనాలు.. వినోదం కోసం ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ని కోరుకుంటున్నారు. థియేటర్స్ క్లోజ్ అవడంతో టీవీల్లో వచ్చే సినిమాలు - సీరియల్స్ తో పాటుగా.. ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో వచ్చే సరికొత్త కంటెంట్ ని ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీలన్నీ వెబ్ సిరీస్ లు - ఒరిజినల్ సినిమాలతో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయాలని చూస్తున్నాయి. అయితే ఇప్పుడు ఓటీటీ వెబ్ సిరీస్ లకు ధీటుగా యూట్యూబ్ సిరీసులు కూడా క్రేజ్ తెచ్చుకోవడం గమనార్హం.
ఒకప్పుడు యూట్యూబ్ అంటే పాత సినిమాలు - వీడియో సాంగ్స్ - షార్ట్ ఫిల్మ్స్ వంటివి చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి కనబరిచేవారు. కానీ ఇప్పుడు వెబ్ సిరీస్ లకు పోటీగా యూట్యూబ్ లో కూడా రకరకాల జోనర్ సిరీస్ లు అందుబాటులోకి వస్తున్నాయి. మినిమమ్ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ యూట్యూబ్ సిరీస్ లు మిలియన్ల్ కొద్ది వ్యూస్ రాబడుతున్నాయి. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటున్న ఈ సిరీస్ లు.. దీనికి తగ్గట్లుగానే రెవెన్యూ కూడా రాబడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా యూట్యూబ్ సిరీస్ లలో వర్క్ చేసే టెక్నిషియన్స్ కు.. అందులో నటించే నటీనటులకు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి.
ఇదిలాఉంటే ఓటీటీలలో విడుదలవుతున్న వెబ్ సిరీస్ లలో సినిమాలకి పని చేసే నటీనటులే ఉంటున్నారు. దీని వల్ల జనాలకి ఫ్రెష్ ఫీల్ కలగడం లేదని తెలుస్తోంది. అందుకే రొమాన్స్ - హ్యూమర్ తదితర అంశాలతో రూపొందించిన కొన్ని యూట్యూబ్ సిరీస్ లు.. ఓటీటీలలో వచ్చే వెబ్ కంటెంట్ కంటే ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. ప్రస్తుతానికైతే తెలుగు వెబ్ సిరీస్ సెగ్మెంట్ లో యూట్యూబ్ దే పైచేయిగా ఉంది. దీనిని బట్టి చూస్తే యూట్యూబ్ సిరీస్ ల ధాటికి ఓటీటీ వెబ్ సిరీస్ లు తట్టుకోలేకపోతున్నాయని చెప్పవచ్చు.