ఈమద్య కాలంలో సౌత్ స్టార్ హీరోలు బాలీవుడ్ లో జెండా పాతి అక్కడి జనాల నుండి అభిమానం దక్కించుకుంటున్నారు. ప్రభాస్.. అల్లు అర్జున్.. యశ్ వంటి సౌత్ స్టార్స్ ఇప్పటికే అక్కడ స్టార్స్ అయ్యారు. ఇంకా కొందరు కూడా ఆ దిశగా అడుగు లు వేస్తున్నారు. మరో వైపు బాలీవుడ్ హీరోలు కూడా సౌత్ లో స్టార్ డమ్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలోనే బాలీవుడ్ స్టార్స్ హాలీవుడ్ లో ప్రయత్నాలు చేస్తున్నారు.
బాలీవుడ్ లో స్టార్ కిడ్ గా అడుగు పెట్టిన టైగర్ ష్రాఫ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. హీరోపంతి సినిమా తో హిందీ ప్రేక్షకులకు చేరువ అయిన టైగర్ ష్రాఫ్ ఇప్పడు యాక్షన్ సినిమాల బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లుగా మారిపోయాడు. హీరోగా వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకోవడంలో సూపర్ హిట్ అయ్యాడు.
బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ కు హాలీవుడ్ కు వెళ్లాలనే కోరిక ఉందట. ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ అండ్ యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరుగా నిలిచిన టైగర్ హాలీవుడ్ యాక్షన్ సిరీస్ లో నటించాలని కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న టైగర్ ష్రాఫ్ త్వరలోనే ఆయన అనుకున్నట్లుగా హాలీవుడ్ కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజాగా హీరోపంతి 2 సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు టైగర్ రెడీ అయ్యాడు. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక మీడియా సమావేశంలో హాలీవుడ్ కోరికను వెళ్లడించి అందరి దృష్టిని ఆకర్షించాడు. యాక్షన్ సినిమాలతో హాలీవుడ్ లో ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నట్లుగా వెళ్లడించిన ఆయన త్వరలోనే ఆ దిశగా ప్రయత్నాలు చేయబోతున్నట్లుగా కూడా ప్రకటించాడు.
ఇంకా టైగర్ ష్రాఫ్ మాట్లాడుతూ... హాలీవుడ్ లో ఫుల్ టైమ్ యాక్షన్ హీరోలు అంటూ ఎవరు లేరు. అది కూడా నా ఏజ్ గ్రూప్ వారు అక్కడ యాక్షన్ హీరోలుగా లేరు. 90 దశకం నుండి స్పైడర్ మ్యాన్ మినహా పూర్తి స్థాయి యాక్షన్ సన్నివేశాలతో సినిమాలు రావడం లేదు. అందుకే అక్కడ పూర్తి స్థాయి యాక్షన్ హీరోగా పేరు దక్కించుకోవాలని చూస్తున్నారు.
హాలీవుడ్ నుండి రెండు సార్లు ఆఫర్ వచ్చింది. కాని ఆడిషన్స్ సరిగా చేయలేక పోవడంతో ఆఫర్ మిస్ చేసుకున్నాను. ఇంకా నేను ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. తప్పకుండా భవిష్యత్తులో హాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశం వస్తుందనే నమ్మకంతో వెయిట్ చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో సందడి చేస్తుంది.. మరి టైగర్ కూడా అక్కడ రాణిస్తాడేమో చూడాలి.