తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత-దర్శకుడు ఎంఎస్ రాజు ఇంట పెళ్లి బాజా మోగనున్న విషయం తెలిసిందే. ఆయన కుమారుడు, యంగ్ హీరో సుమంత్ అశ్విన్ ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కుమారుడి వివాహ విశేషాలను మీడియాతో పంచుకున్నారు ఎంఎస్ రాజు.
‘‘గతేడాది కరోనా వైరస్ కారణంగా మనం ఎంతో సంక్లిష్టమైన జీవితాన్ని గడిపాం. ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. ఇలాంటి సమయంలో మా ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతుండడం ఆనందంగా ఉంది. ఈ పెళ్లి మా ఇంట ఎంతో ప్రత్యేకం. హైదరాబాద్ నగర శివారులోని మా ఫాం హౌజ్ లో ఈ వివాహం జరగనుంది. తెలుగు సాంప్రదాయాల ప్రకారం మూడు రోజుల పాటు పెళ్లి వేడుక నిర్వహిస్తాం. ఈ వివాహానికి సంబంధించిన పనులన్నీ నేనే స్వయంగా చూసుకుంటున్నాను. ఇక, ఈ పెళ్లి బంధుమిత్రులు, సన్నిహితులు కేవలం వంద మంది సమక్షంలో జరుగుతుంది.’’ అని చెప్పారు.
ఇక, తమ ఇంటికి రాబోయే కోడలి గురించి కూడా చెప్పారు రాజు ‘‘దీపిక వంటి మంచి అమ్మాయి మా ఇంటికి కోడలిగా రాబోతుండడం మాకు చాలా ఆనందంగా ఉంది. తను చాలా ఒద్దికైన అమ్మాయి. మంచి గుణవతి. ప్రస్తుతం డల్లాస్ లో రీసెర్చ్ సైంటిస్టుగా పనిచేస్తోంది.’’ అని చెప్పారు.