పీసీని తెగ ఫాలో అవుతున్నారుగా..!
ఐతే ఇన్నాళ్లకు మళ్లీ పీసీని ఇండియన్ స్క్రీన్స్ పై చూడబోతున్నాం అది కూడా మన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో అమ్మడు ఛాన్స్ కొట్టేసింది.;
బాలీవుడ్ సినిమాలతో పాపులర్ అయ్యి ఆ క్రేజ్ తో హాలీవుడ్ బాట పట్టింది ప్రియాంకా చోప్రా. అక్కడికి వెళ్లడం ఒక ఎత్తైతే అక్కడ పాప్ సింగర్ ని పెళ్లాడటం వల్ల అమ్మడి రేంజ్ మారిపోయింది. అంతకుముందు తన మొదటి ఆప్షన్ బాలీవుడ్ మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు అది ఆఖరి ఆప్షన్ అయ్యింది. ఈ పదేళ్ల కాలంలో ప్రియాంకాకు ఎన్నో బాలీవుడ్ ఆఫర్లు ఇచ్చినా ఆమె సింపుల్ గా నో చెప్పేసిందట. ఐతే ఇన్నాళ్లకు మళ్లీ పీసీని ఇండియన్ స్క్రీన్స్ పై చూడబోతున్నాం అది కూడా మన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో అమ్మడు ఛాన్స్ కొట్టేసింది.
ఆర్.ఆర్.ఆర్ తో హాలీవుడ్ మేకర్స్ ని కూడా ఆశ్చర్యపరచిన రాజమౌళి మహేష్ తో చేస్తున్న సినిమాతో మరో లెవెల్ కి వెళ్లనున్నాడు. RRR తో కేవలం సాంగ్ కి మాత్రమే ఆస్కార్ రాగా ఈసారి మహేష్ సినిమాతో అన్ని విభాగాల్లో అకడమీ అవార్డుల గురి పెట్టాడట జక్కన్న. అందుకే ప్రియాంక కూడా మామూలుగా ఐతే ఒప్పుకునేది కాదు కానీ జక్కన్న ప్లాన్ తెలుసు కాబట్టే ఓకే అనేసింది. ఐతే ఇన్నాళ్లు హాలీవుడ్ సినిమాలు, సీరీస్ లు చేస్తూ వచ్చిన ప్రియాంక ఈమధ్య ఇక్కడ ఆడియన్స్ తో అంత టచ్ లో లేదు.
ఐతే ఎప్పుడైతే మహేష్ రాజమౌళి కాంబో సినిమాకు సైన్ చేసిందో మళ్లీ అమ్మడు ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. తన ప్రతి అప్డేట్ ని ఇన్ స్టాలో షేర్ చేస్తూ వస్తున్న పీసీ SSMB 29 సినిమా ఓకే చేశాక ఇంకాస్త ఫాలోవర్స్ ని పెంచుకున్నట్టు తెలుస్తుంది. అందుకే ఈ ఫాలోవర్స్ కి ఎంగేజ్ అయ్యేలా ఇండియాలో తన ట్రిప్స్, తను వెళ్తున్న ప్రదేశాల గురించి షేర్ చేస్తుంది.
మహేష్ తో ప్రియాంక చోప్రా చేస్తున్న ఈ సినిమాపై ఆకాశాన్ని అంటే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ఇప్పటికే మొదలు పెట్టగా త్వరలో ఫారిన్ షెడ్యూల్ ఉండబోతుందని తెలుస్తుంది. తప్పకుండా ప్రియాంక చోప్రాకి ఇది మంచి సినిమానే అయ్యేలా ఉంది. ఐతే ఈ సినిమాతో హాలీవుడ్ లో కూడా ప్రియాంక క్రేజ్ ని వాడుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. మరి రాజమౌళి మహేష్ సినిమా తర్వాత మళ్లీ ప్రియాంక వరుస సినిమాలు ఇక్కడ చేస్తుందా లేదా అన్నది చూడాలి.