తెలుగు ఇండస్ట్రీ ప్రస్తుత సూపర్ స్టార్ కి కూడా కలెక్షన్ల భయం తప్పడం లేదు. ఒకటి రెండు సార్లు కథ చెక్ చేసుకొని సినిమా రిలీజ్ కి ముందు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికి రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ గండాన్ని ఎలా దాటుతుందనే టెన్షన్ ప్రస్తుతం తారలకి పరిపాటిగా మారింది. ఈ టెన్షన్ జోన్ లోకి ఇప్పుడు మహేశ్ కూడా ఎంటరైయ్యాడు - ఇదే విషయాన్ని స్వయంగా మహేశ్ ఒప్పుకోన్నాడంటే - తారల్లో కలెక్షన్స్ ఫీవర్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది.
ముఖ్యంగా లోకల్ మార్కెట్ ని వదిలేసి ఓవర్ సీస్ లో మార్కెట్ పెంచుకోవడం కోసం హీరోలు తెగ ఊవ్విళ్లూరుతున్నారు. ఇందుకు మహేశ్ కూడా మినాహాయింపు కాదు - ఓవర్ సీస్ లో సినిమాకి వచ్చే కలెక్షన్లు బట్టి - సినిమా హిట్ లేదా ఫ్లాప్ అనే నిర్ణయానికి తారలు వచ్చేస్తున్నారు. సినిమా కలెక్షన్లకు ఆయువు పట్టు వంటి నైజాం - నార్త్ ఆంధ్ర ఏరియాలు అక్కడ ఉండే బీ - సీ సెంటర్ల పై తారలు కాస్త చిన్న చూపు ఉందనే చెప్పాలి. ఇక మహేశ్ విషయానికొస్తే - ఆల్రేడీ సూపర్ స్టార్ ట్యాగ్ ఉంది - కోట్ల కొద్ది లోకల్ అభిమానులు ఉండటంతో ఇక్కడ బిజినెస్ ఆ తరువాత వచ్చే కలెక్షన్స్ కి ఏ మాత్రం ఢోకా లేదు - ఎటొచ్చి ఓవర్ సీస్ లో కలెక్షన్స్ రికార్డులు సృష్టించేందుకు మహేశ్ ఇంట్రెస్ట్ చూపుతున్నట్లుగా అనిపిస్తోంది.
అయితే మహేశ్ ఆశలకి మాత్రం - ఓవర్ సీస్ డిస్ట్రీబ్యూటర్లు మాత్రం ఏప్పట్టికప్పుడు నీళ్లు చల్లుతూనే ఉన్నారు. ఎక్కడైనా హీరోల గత సినిమాల మార్కెట్ ఆధారంగానే బిజినెస్ జరుగుతుంటుంది. కానీ మహేశ్ వంటి సూపర్ స్టార్ సినిమా రిలీజ్ అయితే మాత్రం ఓవర్ సీస్ ఆడియెన్స్ థియేటర్స్ కి క్యూలు కడతారు - సినిమా ఏవరేజ్ టాక్ తెచ్చుకుంటే చాలు - కలెక్షన్లు 2 మిలియన్ డాలర్స్ దాటిపోతాయి. కానీ ఓవర్ సీస్ ప్రతి సారీ మహేశ్ స్టామినా పై అపనమ్మకంగానే ఉంటారు. వాళ్లు సేఫ్ జోన్ లో ఉండేందుకు కావాలనే మహేశ్ మార్కెట్ ని తగ్గిస్తూ - సినిమాను 2 మిలియన్ లేదా అంతకంటే తక్కువుకే బిజినెస్ జరిగేలా జాగ్రత్త పడుతుంటారు. ఇది మహర్షీ విషయంలో కూడా రిపీట్ అయింది. గ్రేట్ ఇండియా పిక్చర్స్ మహర్షీ హక్కుల్ని దాదాపు 12.5 కోట్లకి దక్కించుకుందని ట్రేడ్ టాక్. ఈ బిజినెస్ ఫిగర్స్ లో నిజమో కాదో అనే విషయాన్ని కాసేపు పక్కనపెడితే మహేశ్ ముందు సినిమాలు కంటే ఇది కాస్త బెటర్ రేటు అవ్వడంతో గుడ్డిలో మెల్లలా దీన్నే ఫ్యాన్సీ రేటుగా మహర్షీ నిర్మాతలు, మహేశ్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మీడియం రేంజ్ హీరోల సినిమా ఓవర్సీస్ హక్కుల్ని కూడా వారి మార్కెట్ కంటే ఎక్కువ రేటుకి దక్కించుకోవడానికి తహతహలాడే ఓవర్సీస్ డిస్ట్రీబ్యూటర్లు మహేశ్ విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేయడం - ఫ్యాన్స్ కి కాస్త మింగుడు పడని విషయమే అనుకోవాలి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షీ మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది. అగ్ర నిర్మాతలు దిల్ రాజు - అశ్వనీదత్ - పి.వి.వి ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కించారు.