ఏదైనా అప్ కమింగ్ హీరో సినిమాని ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అంతకు ముందు ఓ సినిమా 60 కోట్లు రాబట్టిందనో లేదా ఒకదానికి 2 మిలియన్ డాలర్లు వచ్చాయనో అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుందనుకోవడం అత్యాశ. ఇప్పుడు ఇదే ఓ యుఎస్ బయ్యర్ ని నిండా ముంచేసింది టాక్. అమెరికాలో ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్నఓ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీ అది. పొయెటిక్ గా అనిపించే పేరున్న ఆ సంస్థకు పెద్దగా అనుభవం లేనప్పటికీ జరుగుతున్న బిజినెస్ చూసి తానూ అడుగు పెట్టింది.
కానీ కేవలం ఐదారు సినిమాల అనుభవంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఓ యూత్ హీరో మార్కెట్ నమ్మి ఓవర్ కాన్ఫిడెన్స్ తో నాలుగు బాషలలో రిలీజ్ చేసిన ఓ కొత్త సినిమాను భారీ ధరకు కొనేసింది. కట్ చేస్తే పది రోజులు దాటినా అది మిలియన్ మార్క్ చేరుకోలేదు. వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్లు ఇచ్చినా లాభం లేకపోయింది. జెన్యున్ హిట్ అతి త్వరలో మిలియన్ మార్క్ చేరుకుంటుందని ప్రకటనలు గుప్పిస్తున్నారు కాని వాస్తవ పరిస్థితి వేరుగా ఉంది.
హీరో మార్కెట్ ని అనవసరంగా ఎక్కువగా ఊహించుకుని ఇన్వెస్ట్ చేయడంతో ఇప్పుడు అసలుకే మోసం వచ్చేసింది. ఆ సినిమాను ఎక్కువ రేట్ కు అమ్మిన నిర్మాణ సంస్థ నెక్స్ట్ మూవీని ఇదే కంపనీని ఇచ్చేందుకు అంతగా ఆసక్తి చూపకపోవడంతో ఇప్పుడీ బయ్యర్ దుకాణం మూసే పరిస్థితి వచ్చేసిందట. నిర్మాత అడిగినంతా ఇచ్చేసుకుని కేవలం హీరోల క్రేజ్ ల మీద డబ్బులు వచ్చేస్తాయని అనుకోవడం భ్రమని ఇప్పుడీ ఉదంతం ద్వారా మరోసారి అర్థమయ్యిందనే చెప్పాలి. పైకి కామధేనువుగా కనిపించే ఓవర్సీస్ మార్కెట్ సినిమా కంటెంట్ లో ఏ మాత్రం తేడా ఉన్నా ఇదుగో ఇలా కాల నాగై నష్టం రూపంలో కాటు వేస్తుంది.