ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని ఆకట్టుకున్న బిగ్ బాస్ షో కి ఇప్పుడిపుడే సౌత్ జనాలు కూడా ఆకర్షితులవుతున్నారు. తెలుగులో అయితే ప్రస్తుత ఎన్టీఆర్ తనదైన శైలిలో ముందుకు తీసుకువెళుతున్నాడు. ఇక తమిళ్లో కమల్ హాసన్ కాస్త తడబడుతూ షోని లాక్కెలుతున్నాడు అనే చెప్పాలి. ఎందుకంటే మొదటి తమిళ్ బిగ్ బాస్ షో అంతగా పాపులర్ అవ్వలేదు. ఆ తర్వాత కాంట్రవర్సీల వల్ల మరియు షోలో జరిగిన పరిణామాల వల్ల బాగానే పాపులర్ అయ్యింది.
దీంతో షో నిర్వాహకులు కూడా బిగ్ బాస్ కి ప్రచారాలని బాగానే కలిపించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మళ్ళీ మొదటికి వచ్చాయి. ఎందుకంటే నటి "ఓవియ" వెళ్లినప్పటి నుండి ఈ షో రేటింగ్ కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తోందట. దీంతో షో నిర్వహకులు ఆమెను మళ్ళీ షోలోకి రప్పించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఓవియ ఉన్నపుడు మొదట చాలా హుషారుగా షోలో పాల్గొంది కాని ఆమె అక్కడ పరిస్థితులకు తీవ్రంగా కృంగిపోయి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా అరవ్ అనే మరో కంటెస్టెంట్ తో ప్రేమ వ్యవహారం అని కాస్త ఇబ్బంది కూడా పడినట్లు వార్తలు మరియ సోషల్ మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి.
ఆ పరిస్థితులను ఎదుర్కోలేనని వెళ్లిపోయిన ఓవియ మళ్ళీ వస్తుందా అనేది సందేహంగానే ఉంది. అయితే షో నిర్వాహకులు మాత్రం ఆమెను ఎలాగైనా రప్పించాలని అనుకుంటున్నారట. అలాగే ఆమెకు వారానికి 5 లక్షలు కూడా ఇచ్చేందుకు సిద్ధపడ్డారని సమాచారం. అయితే ఇంతకుముందు కేవలం 2.50 లక్షలను మాత్రమే ఇచ్చేవారు. మరి ఈ డబుల్ ఆఫర్ కి ఓవియ తన స్వేచ్ఛ ప్రపంచాన్నీ వదిలి మళ్ళీ బిగ్ బస్ హౌస్ లో అడుగుపెడుతుందా అనేది అధికారికంగా చెప్పేంత వరకు నమ్మలేం.