లిమ్కా బుక్ లో కరాటే కళ్యాణి

Update: 2016-02-02 15:30 GMT
టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి ఇప్పుడు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. అనేక సినిమాల్లో కామెడీ కేరక్టర్స్ చేసిన ఈమె.. టెంప్టింగ్ రోల్స్ చేయడంలో కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఈమెను కరాటే కళ్యాణి అనీ హరికథ కళ్యాణి అని ఇండస్ట్రీలో పిలుచుకుంటూ ఉంటారు.

ఈమె అసలు పేరు పడాల కళ్యాణి. సినిమాల కంటే ముందు.. హరికథ కళాకారిణిగా గుర్తింపు పొందిన ఈమె.. ఇప్పటికీ ఆ కళను కంటిన్యూ చేస్తూ ఉంటుంది. అడపాదడపా కాకుండా.. రెగ్యులర్ గానే హరికథలు చెబుతూ ఉంటుంది కళ్యాణి. గతేడాది జూన్ 20 నుంచి 25 వరకూ ఆదిభట్ల కళాపీఠంలో సుదీర్ఘమైన హరికథా కాలక్షేపం నిర్వహించింది కళ్యాణి. ఈ మారథాన్ పెర్ఫామెన్స్ 114 గంటల 45 నిమిషాల 55 సెకండ్ల పాటు కొనసాగింది. హరికథా కళాకారిణిగా ఇది అరుదైన రికార్డు. దీనిని గుర్తించి లిమ్కా బుక్.. ఈమెకు తాజా ఎడిషన్ లో చోటు కల్పిస్తున్నట్లు సమాచారం అందించింది. గతేడాదికి సంబంధించిన బుక్ రిలీజ్ చేసేటప్పుడు హరికథ కళ్యాణి సాధించిన రికార్డు కూడా లిమ్కా బుక్ లో ఉంటుందన్న మాట.

ఇలా ఒక సినీ నటి.. సినిమాలకు సంబంధం లేకుండా.. ఇతర కళలకు గాను ఇంత  పెద్ద గుర్తింపు పొందడం విశేషంగానే చెప్పాలి. సినిమాల వరకూ చూసుకుంటే ఛత్రపతి - మిరపకాయ్ - కృష్ణ సినిమాలు.. ఈమె సినీ కెరీర్ ని తారా స్థాయికి తీసుకెళ్లాయి.
Tags:    

Similar News