చిత్రం : ‘పద్మావత్’
నటీనటులు: దీపికా పదుకొనే - రణ్వీర్ సింగ్ - షాహిద్ కపూర్ - అదితి రావు హైదరి తదితరులు
ఛాయాగ్రహణం: సుదీప్ ఛటర్జీ
నిర్మాణం - సంగీతం - రచన - దర్శకత్వం: సంజయ్ లీలా బన్సాలీ
పద్మావతి.. గత కొన్నేళ్లలో మన దేశంలో ఇంతగా వివాదస్పదమైన మరో సినిమా మరొకటి లేదు. డిసెంబరు 1నే రావాల్సిన ఈ చిత్రం ఈ వివాదాల వల్లే ఆలస్యమైంది. చివరికి వివాదాలన్నింటినీ దాటుకుని.. సెన్సార్ అడ్డంకుల్ని కూడా అధిగమించి.. ‘పద్మావత్’గా పేరు మార్చుకుని ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
చిత్తోడ్ ప్రాంతాన్ని పాలించే రాజ్ పుత్ వంశీకుడు రాజా రతన్ సింగ్ రావల్ (షాహిద్ కపూర్) ఒకసారి వేటకు వెళ్లి అక్కడ మరో రాజ పుత్రిక అయిన పద్మావతి (దీపికా పదుకొనే)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతణ్ని ప్రేమిస్తుంది. తర్వాత ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది. వీరి జీవనం సాఫీగా సాగిపోతున్న సమయంలో.. తన అప్రతిహత జైత్రయాత్రతో రాజ్యాల్ని ఆక్రమిస్తూ వస్తున్న అల్లావుద్దీన్ ఖిల్జీ (రణ్వీర్ సింగ్) కళ్లు.. పద్మావతిపై పడతాయి. ఆమెను దక్కించుకోవడం కోసమే ఖిల్జీ చిత్తోడ్ ప్రాంతంపై దండయాత్రకు దిగుతాడు. మరి అతడి ప్రయత్నం ఫలించిందా.. అతడి ధాటికి రావల్ సేనలు తట్టుకున్నాయా.. యుద్ధంలో ఎవరు గెలిచారు.. చివరికి పద్మావతి ఏమైంది.. అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
ఒక కథను చెప్పడంలో ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి ఉంటుంది. వాళ్లు ఆ శైలిని దాటి బయటికి రారు. రాజీ పడరు. సంజయ్ లీలా బన్సాలీ కూడా అంతే. ఆయన తన సినిమాను కళాత్మకంగా తీయాలనుకుంటాడు. అడుగడుగునా ఆర్టిస్టిక్ బ్రిలియన్స్ చూపించాలనుకుంటాడు. ఈ క్రమంలో కమర్షియాలిటీ గురించి పట్టించుకోడు. ఒక సినిమాను సేల్ చేయడం కంటే తాను ఎలా చెప్పాలనుకుంటే అలా చెప్పడానికే కట్టుబడి ఉంటాడాయన. ‘పద్మావత్’ విషయంలోనూ బన్సాలీ అదే శైలిని కొనసాగించాడు.
ఉదాహరణకు ‘పద్మావత్’లో ఆరంభంలోనే ఒక యుద్ధ సన్నివేశం వస్తుంది. యుద్ధం అనగానే ‘బాహుబలి’ తరహాలో భారీతనం.. ఊహించని ఎత్తుగడలు.. రసవత్తర పోరాటాలు.. ఇవన్నీ ఆశిస్తాం. కానీ ‘పద్మావత్’లోని యుద్ధంలో అలాంటివేమీ కనిపించవు. యుద్ధ సన్నివేశాలు మెరుపులా ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయంతే. ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేయడం.. వారికి ఉత్తేజం కలిగించడం కంటే.. వారిని ఆలోచింపజేయడానికి.. మనసుల్ని తాకడానికే ప్రయత్నించాడు బన్సాలీ. ‘బాహుబలి’ తరహా వీరోచిత విన్యాసాలు.. భారీ యాక్షన్ ఘట్టాలు.. ఫాంటసీలు కోరుకుంటే ‘పద్మావత్’ కచ్చితంగా నిరాశ పరుస్తుంది. బన్సాలీ గత సినిమా ‘బాజీరావు మస్తానీ’ తరహాలో ఆర్టిస్టిక్ బ్రిలియన్స్ చూడాలనుకుంటే మాత్రం ‘పద్మావత్’ మంచి ఛాయిసే.
‘పద్మావత్’లో పెద్ద కథేమీ కనిపించదు. నేరుగా రావల్-పద్మావతిల పెళ్లితో కథ మొదలవుతుంది. ఆ తర్వాత ఖిల్జీ ఆగమనం.. అతడి పరాక్రమం.. క్రూరత్వం గురించి ఒకట్రెండు సన్నివేశాల్లో చూపించడం.. ఆ వెంటనే పద్మావతి అందం గురించి తెలుసుకుని.. ఆమెను చేజిక్కించుకోవడానికి అతను ప్రయత్నం చేయడం.. మధ్యలో కొన్ని మలుపులు.. అంతిమంగా అతడి కోరిక నెరవేరకుండానే కథ ముగియడం.. ఇదీ ‘పద్మావత్’ నడిచే తీరు. పేపర్ మీద చూసుకుంటే చాలా చిన్నగా అనిపించే ఈ కథను.. బన్సాలీ తనదైన శైలిలో నెమ్మదిగా చెప్పడం వల్ల నిడివి రెండు ముప్పావు గంటలై కూర్చుంది. కాబట్టి ‘పద్మావత్’ ఆసాంతం ఆస్వాదించేందుకు కళాత్మక హృదయం.. కొంచెం ఓపిక ఉండాలి.
గొప్ప కెమెరా పనితనం.. కనువిందు చేసే దృశ్యం.. చక్కగా అమరిన సంగీతం.. నటీనటుల గొప్ప అభినయం.. చక్కటి మాటలు.. కళ్లు చెదిరిపోయే సెట్టింగ్స్.. కాస్ట్యూమ్స్.. రాజీ లేని నిర్మాణ విలువలు... మంచి డబ్బింగ్.. ఇలా ‘పద్మావత్’కు అన్ని ఆకర్షణలూ చాలా బాగా కుదిరాయి. ఒక క్లాసిక్ చూస్తున్న భావన అడుగడుగునా కలుగుతుంది. కాకపోతే ఇన్ని ఉన్నప్పటికీ కథనంలో వేగం లేకపోవడం ‘పద్మావత్’కు మైనస్. బన్సాలీ సినిమాలకు అలవాటు పడ్డ వాళ్లకు బాగానే అనిపించినా.. సగటు ప్రేక్షకుడికి.. ముఖ్యంగా ‘బాహుబలి’ తరహా ఎంటర్టైన్మెంట్ ఆశించే వాళ్లకు ‘పద్మావత్’ రుచించకపోవచ్చు.
రణ్వీర్ పోషించిన అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర కొంతమేర వినోదాన్ని.. కొంత ఉత్తేజాన్ని ఇస్తుంది. ఆ పాత్ర చిత్రణ.. రణ్వీర్ స్క్రీన్ ప్రెజెన్స్.. అతడి నటన ఈ సినిమాలో అత్యంత ఆసక్తి రేకెత్తించే విషయాలు. మిగతా పాత్రలు గొప్పగా అనిపిస్తాయి కానీ.. ఇలా వినోదం పంచవు. సినిమా మొత్తంలో పతాక సన్నివేశం అద్భుతంగా అనిపిస్తుంది. భావోద్వేగాల్ని తట్టి లేపేలా గొప్పగా ఆ సన్నివేశాన్ని చిత్రీకరించాడు బన్సాలీ. దర్శకుడిగా అతడి పనితనానికి క్లైమాక్స్ నిదర్శనంగా నిలుస్తుంది. ఇక ‘పద్మావత్’ చూస్తున్నంతసేపూ ఎందుకు ఈ సినిమాను రాజ్ పుత్ లు వ్యతిరేకించారన్నది అర్థం కాదు. సినిమా అంతా కూడా వాళ్లను మోయడానికే సరిపోయింది. ఇందుకోసం బన్సాలీ కూడా రాజీ పడ్డాడేమో్.. కథను కూడా కొంచెం మార్చారేమో.. ఉద్దేశపూర్వకంగా వాళ్లను గొప్పగా చూపించే ప్రయత్నం చేశాడేమో అనిపిస్తుంది. కొన్నిచోట్ల సన్నివేశాలు అసహజంగా అనిపించడానికి కూడా ఇది ఒక కారణమే.
నటీనటులు:
‘పద్మావత్’లో గొప్ప అభినయాలు చూడొచ్చు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది దీపికా పదుకొనే గురించే. పద్మావతిగా ఆమెను చూస్తుంటే ఒక అపురూపమైన భావన కలుగుతుంది. ఆ పాత్రకు తగ్గ నటి ఆమే అనిపిస్తుంది. దీపిక కెరీర్లో ఇది బెస్ట్ పెర్ఫామెన్స్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. అందం.. అభినయం రెండింట్లోనూ ఆమె మార్కులు కొట్టేసింది. షాహిద్ కపూర్ సైతం పరిణతితో కూడిన నటనతో ఆకట్టుకున్నాడు. గుంభనంగా ఉంటూనే హావభావాలు పలికించడంలో.. భావోద్వేగాల్ని పండించడంలో షాహిత్ విజయవంతమయ్యాడు. ఇక ఖిల్జీ పాత్రలో రణ్వీర్ సింగ్ కూడా అదరగొట్టాడు. సినిమాకు అతి పెద్ద ఆకర్షణ అతనే. రణ్వీర్ హావభావాలు ఆసక్తి రేకెత్తిస్తాయి. అదితి రావు హైదరి కూడా చాలా బాగా చేసింది.
సాంకేతికవర్గం:
‘పద్మావత్’లో టెక్నికల్ బ్రిలియన్స్ చూడొచ్చు. బన్సాలీ సంగీత దర్శకుడిగానూ మెప్పించాడు. నేపథ్య సంగీతం చాలా బాగా కుదిరింది. సుదీప్ ఛటర్జీ కెమెరా పనితనం సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఆర్ట్ వర్క్.. కాస్ట్యూమ్స్ గొప్పగా అనిపిస్తాయి. ఈ విషయంలో బెస్ట్ ఔట్ పుట్ వచ్చిన భారతీయ చిత్రాల్లో ఇదొకటిగా నిలుస్తుంది. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి. ఇక బన్సాలీ దర్శకుడిగా కూడా గొప్ప పనితనం చూపించాడు. ప్రతి దృశ్యాన్నీ కళాత్మకంగా మలిచే ప్రయత్నం చేశాడు. ఐతే కథనం ఇంకాస్త బిగువుతో.. వేగంగా ఉండేలా చూసుకోవాల్సింది. అలాగే ఆయన కొంచెం సామాన్య ప్రేక్షకుడిని కూడా దృష్టిలో ఉంచుకుని సన్నివేశాలు తీర్చిదిద్దుకోవాల్సిందేమో.
చివరగా: పద్మావత్.. కళాఖండమే కానీ!
రేటింగ్- 2.75/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre