అసలు పద్మావతి కథ నిజమేనా??

Update: 2017-01-29 14:02 GMT
ఇప్పుడు రాజస్థాన్ కు చెందిన పద్మావతి అనే రాణి కథపై దీపికా పదుకొనె హీరోయిన్ గా ''పద్మావతి'' సినిమాను తీస్తున్నాడు. ఈ సినిమాలో మనోడు తప్పుడు హిస్టరీని తెరకెక్కిస్తున్నాడు అంటూ మొన్ననే కర్ణి సేన అనే కొందరు కార్యకర్తలు భన్సాలిపై ఎటాక్ చేశారు. అక్కడ జైపూర్ లో భన్సాలీ వేసుకునే  సెట్ ను నాశనం చేయడమే కాకుండా.. మనోడిపై కూడా ఎటాక్ చేశారు. అసలింతకీ ఈ పద్మావతి కథ నిజంగానే చరిత్ర అంటే మాత్రం.. కాదనే టాక్ సాహితీవేత్తలు చరిత్రకారుల దగ్గర నుండి వినిపిస్తోంది.

దాదాపు 200 సంవత్సరాల క్రితం 1303లో సూఫి కవి మలిక్ మొహమ్మద్ జయాసి ఒక రొమాంటిక్ కథను రచించాడు. ఆ కథలో భాగంగా ఒక సుందరమైన రాణిగా రాజస్తాన్ లోని చిత్తూరుకు చెందిన  పద్మావతి అనే రాణి ఉందని.. అలాగే ఆమె భర్త రతన్ సింగ్ అని.. ఆమెను కామించిన సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ.. ముందు రతన్ సింగ్ ను చంపేయగా.. తనను తాను సుల్తాన్ కు బంధీగా దొరకుండా అతని కోరికలను తీర్చే సాధనంగా మారకుండా ఉండడానికి.. పద్మావతి మంటల్లోకి దూకేసి ఆత్మహత్య చేసుకుంటుంది. ఇదంతా సదరు కవి చెక్కిన ఒక రొమాంటిక్ గాధ. అయితే ఇదే నిజమని ఇప్పుడు చాలామంది నమ్మేస్తున్నారు కాని.. అసలు ఈ కథకు ఆధారాలే లేవని చరిత్రకారులు చెబుతున్నారు. అలాంటప్పుడు ఆ పద్మావతి చరిత్ర అంటూ భన్సాలీ ఇంకో కాకమ్మ కట్టు కథను తెరకెక్కించినా కూడా దానికి ఎందుకు ఇంత రాద్దాంతం అంటూ సాహిత్యవేత్తలు కూడా ప్రశ్నిస్తున్నారు.

ఇకపోతే ఈ యవ్వారంపై నిజానిజాలు అనే విషయం పక్కనెట్టేస్తే.. ఒక సినిమాను తీస్తున్న డైరక్టర్ ను ఇది తప్పు ఇది ఒప్పు అంటూ పబ్లిక్ గా ఎటాక్ చేయడం.. క్రియేటివ్ ఫ్రీడమ్ ను హరించడమే. ఏదన్నా ఉంటే కోర్టులో ఛాలెంజ్ చేసుకోవాలి కాని.. ఇలా క్రిమినల్ ఎటాకింగ్ కు పాల్పడటం మాత్రం మంచిది కాదు అనే విషయాన్ని లీగల్ ఎక్సపర్టులు కూడా చెబుతున్నారు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News