సినిమాకి వస్తున్న రెస్పాన్స్ తో ఫుల్ జోష్ లో ఉంది "ఎం ఎస్ ధోనీ - ది అన్ టోల్డ్ స్టోరీ" మూవీ టీం అంతా. ఇంతలోనే ఒక చేదువార్త... ధోనీ సినిమాను పాక్ లో బ్యాన్ చేయాలని నిర్ణయించారు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు. పాకిస్థాన్ కు చెందిన ఐ.ఎం.జి.సి. గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ అనే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ "ఎం ఎస్ ధోనీ - ది అన్ టోల్డ్ స్టోరీ" పాక్ లో సినిమా విడుదలకు సంబందించిన హక్కులు సంపాదించింది. అయితే భారత్ - పాక్ మధ్య నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలోనూ ఈ సినిమా విడుదలను నిలిపివేస్తున్నట్లు నిర్ణయించారు.
అయితే ఇది సినిమాకి ఒక మోస్తరు బ్యాడ్ న్యూస్ గానే చెబుతున్నారు సినీ జనాలు. పాకిస్థాన్ లో ఒక క్రికెటర్ గా ధోనీకి ఎంత ఫాలోయింగ్ ఉందో, బాలీవుడ్ సినిమాలకూ అదే స్థాయి ఫాలోయింగ్ ఉంది. ఈ సమయంలో ధోనీ పేరున రాబోతున్న ఈ బయోపీక్ పాకిస్థాన్ లో విడుదల కాకపోవడం సినిమాకు దెబ్బే అని చెప్పుకోవచ్చు. "ఎం ఎస్ ధోనీ - ది అన్ టోల్డ్ స్టోరీ" ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాల్లో సెప్టెంబరు 30న విడుదల కానుంది!
కాగా, "మరో రెండు రోజుల్లో భారత్ లో ఉన్న పాకిస్థాన్ నటులంతా భారత్ విడిచి వెళ్లిపోవాలి" అని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన జారీ చేసిన అల్టిమేట్టం జారీ అయిన నాటి నుంచీ జరుగుతున్న సంచలనాల సరసన ఈ విషయం కూడా చేరినట్టేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ అల్టిమేట్టం పాక్ లో ధోనీ సినిమాపై ప్రభావం చూపినట్లే అనిపిస్తుంది. ఇదే క్రమంలో కరణ్ జోహార్ సినిమాలపై కూడా మహారాష్ట్ర నవ నిర్మాణ సేన కన్నెర్ర చేసిన సంగతి తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/