హిందీ సినిమాపై టెర్రరిస్టు కన్ను

Update: 2015-08-13 08:50 GMT
సైఫ్ ఆలీఖాన్ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ఫాంటమ్. కబీర్ ఖాన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని... కత్రినాకైఫ్ సాజిద్ నడియడ్వాలా, సిద్ధార్ధ రాయ్ కపూర్ నిర్మిస్తున్నారు. ఫాంటమ్ ను బ్యాన్ చేయాలంటూ.. పాకిస్తాన్ కోర్టులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హఫీజ్ సయీద్ పిటిషన్ వేశాడు. ఈ నేరస్తుడు వేసిన పిటిషన్ పై చిత్ర యూనిట్ ఘాటుగానే స్పందించింది.

ఇలాంటి క్రిమినల్స్ ఇంతకంటే గొప్పగా ఎలా ప్రవర్తిస్తారని.. అనేక దేశాలు వెతుకుతున్న నేరస్తుడిని.. ఏడాదిన్నరగా హౌజ్ అరెస్ట్ లో ఉంచిన దేశంలో టెర్రరిస్టులు కూడా కోర్టులో పిటిషన్ వేసుకునే అవకాశముందంటూ వెక్కరించారు. మా సినిమాలో పాక్ లో రిలీజ్ కాకపోయినా.. విపరీత ప్రవర్తనలు గల ఒక నేరస్తుడిని కుదిపేసే కాన్సెప్ట్ తో సినిమా తీస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు డైరెక్టర్ కబీర్ ఖాన్. ఇకపోతే సైఫ్ కూడా హఫీజ్ పిటిషన్ పై గట్టిగానే స్పందించాడు.

రెండు దేశాల ప్రజల మధ్య ఎంతో అనుబంధం ఉందని,  ఒకవైపు కలిసి ఆటలు ఆడుకుంటున్నామని గుర్తు చేశాడు సైఫ్. రెండు దేశాలకు సంబంధించిన కథను సినిమాగా తీసేపుడు.. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటామని.. ఈ మాత్రం ఆలోచన టెర్రరిస్టులకు ఎలా ఉంటుందన్నాడు సైఫ్. రెడ్ కార్నర్ నోటీసులు అయిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్... బ్యాన్ చేయాలని పిటిషన్ వేయడంతో... ఫాంటమ్ మూవీకి ఇప్పటికే ఫుల్ ప్రమోషన్ వచ్చేస్తోంది. సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
Tags:    

Similar News