దీపావళి సినిమా ‘అఖిల్’ రిలీజైపోయింది. ఇక ఫోకస్ తర్వాతి వారం వచ్చే సినిమాల మీదికి షిఫ్ట్ చేసేయాల్సిందే. వచ్చే వారం ‘చీకటి రాజ్యం’ - ‘కుమారి 21 ఎఫ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. చీకటి రాజ్యం సినిమా విషయంలో ప్రేక్షకులకు ఇప్పటికే ఓ క్లారిటీ ఉంది. కుమారి.. సంగతే అంతుబట్టకుండా ఉంది. ఎందుకంటే దీని కథకుడు సుకుమార్. మనోడు క్రియేటివిటీకి మారు పేరు. అతడి రాతలు ప్రేక్షకుల అంచనాలకు అందవు మరి. ఐతే ఈ సినిమా ‘గర్ల్ నెక్స్ట్ డోర్’ మూవీకి రీమేక్ అని.. ఇందులో హీరోయిన్ని రేప్ చేస్తారని.. రూమర్లు షికారు చేస్తున్నాయి.
దీని గురించి దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ ను అడిగితే.. అలాంటిదేమీ లేదన్నాడు. “రేప్ సీన్ గురించి వస్తున్న రూమర్ల గురించి నేనూ విన్నాను. కానీ ఇందులో రేప్ సీన్ ఉండదు. ఓ సన్నివేశంలో హీరో హీరోయిన్ మధ్య వచ్చిన సైకలాజికల్ కాన్ఫ్లిక్ట్ చూపించాం. కానీ అందులో ఎలాంటి వల్గారిటీ ఉండదు. కుమారి 21 ఎఫ్ కంప్లీట్ ఫీల్ గుడ్ ప్యూర్ లవ్ స్టొరీ. ఇక మా సినిమా దేనికీ స్ఫూర్తి కాదు. మేం ఎక్కడా కాపీ కొట్టలేదు. సుకుమార్ తన అనుభవాల నుంచి ఈ కథ రాశారు. ఆయన ఫ్రీ టైంలో ఉన్నప్పుడల్లా తన లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనలు చెప్పేవారు. ఆ సంఘటనల స్ఫూర్తితో రాసిన కథ ఇది” అని సూర్య ప్రతాప్ చెప్పాడు.