కేజీఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు రాకింగ్ స్టార్ యష్. ఒక సామాన్య ఆర్టీసీ డ్రైవర్ కొడుకు అసాధారణ హీరోగా ఎదిగిన తీరుకు ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు కేజీఎఫ్ 2 పై బోలెడంత ఉత్కంఠ నెలకొంది. కేజీఎఫ్ కంటే పది రెట్లు అదనంగా బిజినెస్ చేస్తున్న ఈ సినిమా విజయంపై కూడా అంతే భారీ అంచనాలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో యష్ తదుపరి ఎంపికలు ఎలా ఉంటాయో చూడాలన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది.
కన్నడ రాకింగ్ స్టార్ యష్ తో సినిమా చేసేందుకు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి... సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ సహా పలువురు సౌత్ డైరెక్టర్లు.. అటు నార్త్ నుంచి ప్రముఖ దర్శకులు కూడా వెయిటింగ్ లో ఉన్నారు. ఈసారి తన లెవల్ ని మరో లెవల్ కి చేర్చగల సమర్థులే వీరంతా. అయితే యష్ వీళ్లకు ఛాన్సు ఇచ్చాడా? అంటే.. ఊహించని పెద్ద షాక్ నే ఇచ్చాడు అతడు.
ఈసారి కూడా కేజీఎఫ్ డైరెక్టర్.. కన్నడ లోకల్ కుర్రాడు ప్రశాంత్ నీల్ లానే మరో కన్నడ దర్శకుడికే అతడు ఛాన్సివ్వడం సంచలనంగా మారింది. అతడి పేరు నార్తన్. యాక్షన్ సినిమాతో సత్తా చాటిన ట్రాక్ రికార్డ్ అతడి సొంతం. అందుకే ఇప్పుడు మరో భారీ యాక్షన్ సినిమాకు నార్తన్ తో కలిసి యష్ ప్లాన్ చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది.
నార్తన్ ఇంతకుముందు `మఫ్టీ` అనే యాక్షన్ సినిమా తీశారు. అతడు ఇప్పటికే యష్ కోసం స్క్రిప్టు రెడీ చేశాడు. అయితే రాజమౌళి.. శంకర్ లాంటి వారినే మించే సినిమాని తీయాల్సిన బాధ్యత ఇప్పుడు అతడిపై ఉందని భావించవచ్చు. అలాగే స్టార్ డమ్ అందిపుచ్చుకున్న తర్వాత లోకల్ దర్శకుల్ని మర్చిపోకుండా యష్ అవకాశమివ్వడం అతడి డౌన్ టు ఎర్త్ స్వభావానికి సింబాలిక్ అని భావించాల్సి ఉంటుంది.