యువ హీరో సందీప్ కిషన్ - లావణ్య త్రిపాఠి జంటగా నటించిన తమిళ చిత్రం ''మాయవన్''. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ కీలక పాత్ర పోషించాడు. విభిన్నమైన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత సి.వి.కుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. నలన్ కుమారస్వామి స్క్రీన్ ప్లే అందించారు. వరుస హత్యల కథా నేపథ్యంలో సస్సెన్స్ మిస్టరీ అంశాలతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. అనేక అవాంతరాల తర్వాత 2017 ఇయర్ ఎండింగ్ లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దీంతో సి.వి.కుమార్ నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా 'మాయవన్' చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేశారు సీవీ కుమార్.
'మాయవన్' సినిమా ఎండింగ్ లోనే దీనికి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. కానీ కమర్షియల్ సక్సెస్ కాకపోవడంతో సీక్వెల్ ఆలోచన చేయకపోవచ్చని అందరూ అనుకున్నారు. అయితే ఈరోజు హీరో శుక్రవారం సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా ''మాయవన్ - రీలోడెడ్'' టైటిల్ తో సీక్వెల్ ప్రకటించారు సీవీ కుమార్. తిరుకుమారన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తన స్వీయ దర్శకత్వంలో తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందుతుందని కుమార్ వెల్లడించారు. అయితే ఆశించిన స్థాయిలో విజయం సాధించని సినిమాకి సీక్వెల్ ఏంటని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కాకపోతే 'అట్టకత్తి' 'పిజ్జా' 'ముందాసుపట్టి' 'సూదు కవ్వుం' 'ఇరుదు సుట్రు' వంటి డిఫరెంట్ సినిమాలతో హిట్స్ అందుకున్న సీవీ కుమార్.. ప్లాప్ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నారంటే కచ్చితంగా ఇందులో ఏదో కొత్తగా చెప్పబోతున్నాడని అర్థం అవుతోంది. ఇకపోతే 'మాయవన్' సినిమాని తెలుగులోకి ''ప్రాజెక్ట్ జెడ్'' పేరుతో అనువాదం చేశారు. సందీప్ కిషన్ కి వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పడం.. అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోవడం వంటి కారణాలతో బాగా ఆడలేదు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా పాన్ ఇండియా మూవీగా వస్తున్న 'మాయవన్ - రీలోడెడ్' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.