కేజీఎఫ్ 2.. యూట్యూబ్ కోసం ఇంత పిచ్చినా?

Update: 2022-04-15 04:30 GMT
అతి స‌ర్వ‌త్రా వ‌ర్జేయ‌త్ అని అంటారు. అతిగా ఏం చేసినా దాని ఫ‌లితం కూడా అలానే ఉంటుంది. కొన్ని తెలుగు యూట్యూబ్ చానెళ్ల వైఖ‌రి చూస్తుంటే అలానే ఉంది. యూట్యూబ్ సోష‌ల్ మీడియా యుగంలో సాంప్ర‌దాయ‌క జ‌ర్న‌లిజం విలువ‌లు ఎప్పుడో మంట క‌లిసిపోయాయ‌న్న ఆవేద‌న ప్ర‌జ‌ల్లో ఉంది. రాజ‌కీయ నాయ‌కుల యూట్యూబ్ వీరంగాలు సెన్సార్ లెస్ గా ఉన్నాయి. ఇప్పుడు సినిమా స‌మీక్ష‌ల పేరుతో వీరంగం కూడా అంత‌కుమించి అనేలా ఉంది.

త‌మ యూట్యూబ్ చానెళ్ల‌కు లైక్ లు క్లిక్ లు పెంచుకునేందుకు ఎలాంటి స‌మీక్ష‌లు ఇస్తున్నారో చూస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ఇంత‌కుముందే ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ 2 లాంటి పాన్ ఇండియా సినిమాలు విడుద‌ల‌య్యాయి . వీటికి యూట్యూబ్ స‌మీక్ష‌కులు ఇచ్చిన కొన్ని రివ్యూలు చూస్తే షాక్ తినాల్సిందే.

మ‌రీ అతిగా అనిపించేవే వీటిలో ఎక్కువ‌. ఉన్న విష‌యాన్ని ప్రాస‌లు యాస‌ల‌తో చెబుతూ బోలెడ‌న్ని కామెడీలు చేస్తున్నారు. అయితే ఇవ‌న్నీ మాస్ లోకి వైర‌ల్ గా దూసుకెళుతుండ‌డంతో యూట్యూబ్ చానెళ్ల‌కు ఇదో అల‌వాటు వ్యాప‌కంగా మారింది.

తాజాగా కేజీఎఫ్ 2 థియేట‌ర్ నుంచి వ‌చ్చిన కొంద‌రు అభిమానులు ఇచ్చిన రివ్యూలు క‌డుపు చెక్క‌ల‌య్యేలా న‌వ్విస్తున్నాయి. వీళ్ల రివ్యూల అతి ఏమో కానీ .. మ‌రీ మాస్ ని ఆక‌ట్టుకునేందుకు ఇలాంటి స‌మీక్ష‌లు ఇవ్వాలా? అన్న సందిగ్ధం క‌లుగుతుంది. ఒక అభిమాని అయితే థియేట‌ర్లోంచే ముఖం ఒళ్లంతా ర‌క్తంతో వ‌స్తూ క‌నిపించాడు. రివ్యూ చెబుతూ ఎమోష‌న‌ల్ అయిపోయాడు.

కేజీఎఫ్ స్టార్ య‌ష్ హీరోయిజం ఎలివేష‌న్స్ గురించి అత‌డు పొగిడేసిన తీరు ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. బ్రో బ్రో అంటూ ప్రాస‌లు ఉప‌యోగిస్తూ వేరొక అభిమాని కేజీఎఫ్ 2 గురించి రివ్యూలిచ్చాడు. ఇక‌పోతే కేజీఎఫ్ 2 పై ఒరిజిన‌ల్ జ‌ర్న‌లిస్టుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న‌లు మాత్ర‌మే వ్య‌క్త‌మయ్యాయి. హీరోయిజం ఎలివేష‌న్స్ త‌ప్ప క‌థ‌-క‌థ‌నాల్లో మొద‌టి భాగం లో చూపించినంత‌గా రెండో భాగంలో ద‌మ్ము లేద‌ని తేల్చేశారు.

కానీ యూట్యూబ్ రివ్యూలు చూస్తే గ‌నుక ఆడియెన్ కి థియేట‌ర్ కి వెళ్లాక తెలుస్తుంది ఇది. ఏది ఏమైనా కేజీఎఫ్ 2 ఆరంభ వ‌సూళ్ల‌కు ఎలాంటి ఢోఖా లేద‌ని థియేట్రిక‌ల్ ఆక్యుపెన్సీ బుకింగుల సంద‌డి చెబుతోంది. తొలి వీకెండ్ 200కోట్లు వ‌సూలు చేస్తుంద‌ని విశ్లేషిస్తున్నారు.



Full View



Tags:    

Similar News