పంజాబ్ తీస్తే కాదు.. ఉంటే గొడవలవుతాయ్

Update: 2016-06-09 15:30 GMT
ఉడ్తా పంజాబ్‌ సినిమాకు ఇంకా అడ్డంకులు తొలగిపోలేదు. దర్శకుడికి, సెన్సార్ బోర్డుకు  మధ్య వివాదం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అసలు ముందు చెప్పింది 40 కట్స్ ను మాత్రమే. అలా కాదని స్క్రీనింగ్ కమిటీ దగ్గరకు వెళితే.. వాళ్లు ఏకంగా 89 కట్లు చేయాలని ఆదేశించారు. దీంతో బాలీవుడ్ అంతా ఏకమై.. సెన్సార్ బోర్డ్ ని, పంకజ్ నిహ్లానీని ఏకి పడేస్తున్నారు. సినిమా టైటిల్ లోనుండి పంజాబ్‌ తీసేసి.. ఇంకేదైనా పెట్టుకోవాలని సూచించడం కూడా డైరెక్టర్ కి బాగా మండించింది. బాలీవుడ్ జనాలు ఏకమైపోయి.. తనపై విమర్శలు చేస్తుండడంతో.. పంకజ్ నిహ్లానీ ఇలా చెప్పుకొచ్చాడు.

''ఉడ్తా పంజాబ్‌ అనే టైటిల్ నుంచి పంజాబ్‌ తీసేసినా.. సినిమాలో ఎనభై శాతానికి పైగా పంజాబీ భాషలోనే సంభాషణలు జరుగుతాయి. అప్పుడు వాళ్లు పంజాబ్ గురించే మాట్లాడుతున్నారని ఆడియన్స్ కు తేలిగ్గానే అర్ధమవుతుంది. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటో తేలిగ్గానే తెలుస్తుంది. నేరుగా పంజాబ్ రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తే.. దానితో చాలా సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే ఇది పంజాబ్ అనేందుకు సంబంధించిన రిఫరెన్సులను తీసేయమని కోరాం'' అంటున్నాడు పంకజ్ నిహ్లానీ.

అయితే.. ఉడ్తా పంజాబ్ లో చాలాచోట్ల హీరో బూతులు మాట్లాడతాడట. అలాగే ఆలియా భట్‌ పాత్రతో అయితే పచ్చిబూతులు చెప్పించారని అంటున్నారు. వీటిలో చాలా బూతులను కట్ చేయకుండా వదిలేశామన్నది సెన్సారు వారి మాట. మరి ఇప్పటికైతే.. ఈ మూవీ రిలీజ్ కి అనుమతి విషయం బాంబే కోర్టు దగ్గరకు చేరింది కాబట్టి.. కోర్టు నిర్ణయం ఎలా ఉండనుందో వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News