వరసగా ఐదు పరాజయాలు పలకరించడంతో సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ కాస్త డల్ అయిన మాట నిజం. ముఖ్యంగా ఇంటెలిజెంట్ సినిమా తీవ్ర విమర్శలకు అవకాశం ఇవ్వడంతో పాటు స్వంత టాలెంట్ ఉన్నా మావయ్యలు ఇద్దరినీ అనుకరిస్తూ అది వర్క్ అవుట్ కాక అనవసరంగా మార్కెట్ పోగొట్టుకుంటున్నాడు అనే కామెంట్స్ బలంగా వినిపించాయి. అందుకే కథల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటానంటున్న ఈ మెగా హీరో ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో కెఎస్ రామారావు నిర్మిస్తున్న సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీపై తేజు చాలా హోప్స్ పెట్టుకున్నాడు. దీని తర్వాత విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న చంద్రశేఖర్ యేలేటితో కూడా ఒక మూవీ ప్లానింగ్ లో ఉన్నాడు.
సినిమాల సంగతి పక్కన పెడితే ఈ సుప్రీమ్ హీరోలో మరో యాంగిల్ కూడా ఉంది. అదే నలుగురికి సహాయం చేయాలనే తత్వం. పైన ఫోటో చూస్తున్న యువకుడి పేరు రంగుల నరేష్ యాదవ్. మంచి పారా అథ్లెట్. ఇతను ప్రతి క్రీడాకారుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే సిట్టింగ్ వాలీ బాల్ ట్రయాంగిల్ సిరీస్ లో పాల్గొనాలని ఆశ పడ్డాడు. కానీ అది జరిగేది బ్యాంకాక్ లో. విషాదం ఏంటంటే దీనికి అయ్యే ఖర్చు పాల్గొనే వాళ్ళే పెట్టుకోవాలి. క్రికెట్ లాంటి క్రీడలను నెత్తిన బెట్టుకుని కోట్లు కుమ్మరించే ప్రభుత్వం ఇలాంటి వాటిపై శీత కన్ను వేయటం సహజం. దీంతో నరేష్ నిస్సహాయుడిగా ఉండిపోయాడు. మీడియా ద్వారా ఈ వార్త తెలుసుకున్న తేజు అక్కడికి వెళ్లి రావడానికి అయ్యే ఖర్చు లక్ష రూపాయలు తాను భరించడానికి సిద్ధ పడి చెక్ కూడా అందించాడు.
రెట్టింపు ఉత్సాహంతో బ్యాంకాక్ వెళ్ళిన సురేష్ కష్టం వృధా కాలేదు. వాళ్ళ టీం టోర్నీలో గోల్డ్ మెడల్ సాధించింది. ఇక నరేష్ ఆనందానికి హద్దులు లేవు. సరైన సమయంలో అవసరాన్ని గుర్తించి పిలిచి మరీ సహాయం చేసిన సాయి ధరం తేజ్ కోరికను కూడా నరేష్ నెరవేర్చాడు. సినిమాలలో ఎంత సంపాదించినా ఇలా అవకాశం ఉన్నప్పుడు సహాయం చేస్తూ ఉంటే ఎంత గొప్ప ఫలితాలు వస్తాయో నరేష్ సాక్షిగా సాయి ధరం తేజ్ రుజువు చేసాడు.