పాపం వాళ్ళేమో ఎంతో కష్టపడి సీన్లు రాస్తున్నారు. మీరేమో వాటికి పేరడీలను తయారు చేసేసి క్యాష్ చేసేసుకుంటున్నారు. మొన్నటివరకు యుట్యూబ్ లో పిచ్చిని తెగ చూసేవారం. గొప్పగా తీసిన కొన్ని సీన్లకు పేరడీల పేరుతో కొన్ని చెత్త స్పూఫ్ లను తయారుచేసి.. నవ్వుతారా చస్తారా అన్నట్లు యుట్యూబ్ లో ఉంచుతుంటారు కొందరు జనాలు. వాటికి మనం నవ్వడం.. సదరు హీరోలకు సీరియస్ ఫ్యాన్లు ఏసీలు అయితే బండ బూతులు తిట్టడం కామన్ గా జరిగేది. ఇప్పుడు ఈ పైత్యం ఏకంగా సినిమాల్లోకే చేరిపోయింది.
ఈ మధ్యన చాలా సినిమాల్లో కమెడియన్లందరూ కలసి కట్టుగా వాడుతున్న డైలాగ్.. ''నేను సింహం - మిగిలినదంతా సేమ్ టు సేమ్..'' లేకపోతే ''ఎంతో కొంత తిరిగిచ్చేయాలి.. లేకపోతే లావై పోతాం''.. మరీ కాకపోతే.. ''వీలైతే క్షమించు.. లేకపోతే మన్నించు.. కాని మమ్మల్ని గుర్తించు''.. ఇవన్నీ అత్తారింటికి దారేది, శ్రీమంతుడు సినిమాల్లోని సీన్ల తాలూకు డైలాగులని చెప్పక్కర్లేదుగా. ఏదో కొత్త సీన్లు రాయడం రాన్నట్లు ఇప్పుడు చాలా సినిమాల్లో ఈ ప్యారడీలనే వాడుతున్నారు. ఆఖరికి నిన్న రిలీజ్ అయిన రవితేజ బెంగాళ్ టైగర్ సినిమాలో కూడా సేమ్ ఇవే డైలాగులు. ఇవే సీన్లు. వాటితోనే కామెడీ.
మొత్తానికి దర్శకులందరూ ఇలా త్రివిక్రమ్.. కొరటాల శివను కలసి కట్టుగా వాడేస్తున్నట్టు అనిపించట్లేదూ? వాడేస్కోండయ్యా వాడేస్కోండి. మీకంతే వచ్చు అనుకుంటూ మేం కూడా సరిపెట్టసుకుంటాం.