పరమ సుందరి @500M

Update: 2022-01-16 06:58 GMT
గత ఏడాది బాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిమి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా విజయంలో సంగీతం కీలక పాత్ర పోషించింది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా సినిమా కోసం మన సంగీత సౌత్‌ స్టార్‌ ఏఆర్ రహమాన్ అందించిన పరమ సుందరి పాట అద్బుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడ అక్కడ.. ఆ భాష.. ఈ భాష అనే తేడా లేకుండా ప్రతి ఒక్క సినీ ప్రియుడు మ్యూజిక్ ప్రియుడు ఈ సాంగ్ ను స్ట్రీమింగ్‌ చేశారు. యూట్యూబ్‌ లో పరమ సుందరి పాట ఏకంగా 500 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకుంది. ఈమద్య కాలంలో పాటలు వందల మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకోవడం కామన్ విషయమే. కాని మిమి లోని ఈ పాట ఏకంగా 500 మిలియన్ వ్యూస్‌ ను దక్కించుకోవడం రికార్డుగా చెప్పుకోవచ్చు.

రహమాన్‌ సంగీతం చాలా ప్రాచుర్యం పొందింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన పాటలు ఎన్నో వందల మిలియన్స్ వ్యూస్ ను దక్కించుకున్నాయి. కాని ఈ పాట మాత్రం చాలా తక్కువ సమయంలో 500 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకుని సరికొత్త రికార్డును నమోదు చేయడం జరిగింది. ఈ పాట ప్రతి ఒక్క పబ్లిక్ ఈవెంట్‌ లో డాన్స్ షో లో వినిపించింది.. ఇంకా వినిపిస్తూనే ఉంది. పెళ్లిల బరాత్ నుండి మొదలుకుని అన్ని కార్యక్రమాల్లో ఈ పాట మారు మ్రోగుతూ ఉంది అంటూ సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఈ పాటకు ఈ స్థాయి వ్యూస్‌ దక్కాయి.

ఈ పాట కవర్‌ వీడియోలకు కూడా వందల మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి. వేల కొద్ది కవర్‌ వీడియోలు చేసి తమ డాన్స్ ప్రతిభను చూపించే ప్రయత్నం చేశారు. డాన్స్ చేయడంకు అనుకూలంగా ఉండటం వల్లే ఈ పాటకు ఇన్ని వ్యూస్ వచ్చాయి అనేది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. మొత్తానికి రహమాన్‌ స్థాయి పరమ సుందరి పాటతో మరింతగా పెరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సౌత్‌ లో దిగ్గజ సంగీత దర్శకుడు బాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ కంపోజర్‌ అయిన ఆస్కార్ అవార్డు  గ్రహీత రహమాన్‌ ముందు ముందు ఇలాంటి మరిన్ని సూపర్ డూపర్‌ పాటలను ఇవ్వాలంటూ అ భిమానులు కోరుకుంటున్నారు.
Tags:    

Similar News