టీజర్ టాక్ :భయానికే అమ్మమ్మలా ఉంది

Update: 2018-02-07 07:44 GMT
విరాట్ కోహ్లీతో పెళ్లి తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన అనుష్క శర్మ తిరిగి వచ్చేసింది. ఎప్పుడు బబ్లీ గర్ల్ గా ప్రేమించే పాత్రల్లో కనిపించే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాత్రం ఊహలకు అందని రీతిలో భయపెట్టే అవతారంతో ముందుకు వచ్చింది. అదే బాలీవుడ్ మూవీ పరి. ప్రోసిత్ రాయ్ దర్శకత్వంలో ప్రరంబత చటర్జీ, రజత్ కపూర్, రీతాబరి చక్రవర్తి ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా యాభై సెకండ్ల టీజర్ ఇవాళ విడుదల చేసారు. నిడివి తక్కువగానే ఉన్నా చెప్పాలునుకున్న విషయాన్నీ సూటిగా స్పష్టంగా ఇందులో చెప్పారు. కాదు చూపించారు. అనుష్క శర్మ గతంలో ఎన్నడు చూడని తరహాలో హారర్ సినిమాలో నటించడం ఒక ట్విస్ట్ అయితే దెయ్యం కూడా తనే కావడం పరి ప్రత్యేకత. చాలా డిఫరెంట్ గా అనిపించే మేకింగ్ తో ఇంటరెస్టింగ్ అనిపించేలా ఇది కట్ చేసారు.

పేపర్ పైన గీసిన కొన్ని పెన్సిల్ స్కెచ్చులు. నిజ జీవితంలో అచ్చంగా అలాంటివే కొన్ని సంఘటనలు. వీటికి లింక్ చేస్తూ ఇంట్లో ఒంటరిగా ఉండే భార్యా భర్తల మధ్య యేవో అపోహలు. తీరా చూస్తే అంతు చిక్కని రీతిలో చావులు, కేకలు, చేజులు వెరసి కూసింత ఆసక్తికరంగానే ఉంది టీజర్. ముఖ్యంగా చివర్లో అనుష్క ఒక రూమ్ లో దెయ్యం ఓ బిడ్డకు రక్తాన్ని పాల సీసాలో పడుతుండగా దగ్గరికి వెళ్లి చూసిన తనకు అది తన రూపంలోనే ఉండటం చూసి మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ అసలు ఆకర్షణ. హాలీవుడ్ తరహా మేకింగ్ తో ఆకట్టుకునే ఉన్న ఈ టీజర్ ని షేర్ చేస్తూ అనుష్క శర్మ ఇది ఆహ్లాదకరమైన కథ కాదని ముందే భయాన్ని ఇంజెక్ట్ చేసింది.

హోలీ సందర్భంగా మార్చ్ 2న పరి విడుదల కానుంది. ఈ మధ్య హారర్ సినిమాలకు ఆదరణ పెరిగింది. హీరో సిద్దార్థ్ ఇటీవలే గృహం అనే సీరియస్ హారర్ చేస్తే ప్రేక్షకులు బాగానే పట్టం గట్టారు. పరి కూడా ఊహించని మలుపులతో ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలతో భయపెట్టడం ఖాయం అనిపించేలా ఉంది. దెయ్యం పాత్రలో అనుష్క శర్మను చూసి కోహ్లీ ఏమంటాడో కాని ప్రేక్షకులు మాత్రం జడుసుకుంటున్నారు. మీరూ ఓ లుక్ వేయండి. 

Full View
Tags:    

Similar News