ఆసీస్ కి బ్రాండ్ అంబాసిడర్ వా అమ్మడూ

Update: 2016-02-26 17:30 GMT
బొద్దు నుంచి ముద్దుగా మారిపోయిన పరిణీతి చోప్రా.. ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్ లో ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా వచ్చానని, ఫుల్లుగా ఎంజాయ్ చేస్తానని ముందే చెప్పిన ఈ భామ.. తన ఎంజాయ్ మెంట్ ను అందరికీ పంచుతోంది కూడా. టూర్ మొదటి రోజు నుంచి తన ట్రిప్పులకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేస్తోందీ సుందరాంగి.

కెయిర్న్ గ్రేట్ బారియర్ రీఫ్.. ఆస్ట్రేలియాలో ఫేమస్ హాలీడే స్పాట్. ఇక్కడ ఎంజాయ్మెంట్ కోసమే పరిణీతి ఆస్ట్రేలియా వెళ్లింది. అప్పటి నుంచి తనుండే హోటల్ తో మొదలు పెట్టి, టీజపూకై హోటల్, అందులో అక్కడి స్థానికుల లైవ్ పెర్ఫామెన్స్.. తర్వాత నౌటిలస్ హెలికాప్టర్ లో రైడ్, అక్కడి నుంచి బీచ్ ఒడ్డున సరాగాలు, గ్రేట్ బారియర్ రీఫ్ లో ట్రిప్.. ఇలా ఫోటోలు షేర్ చేస్తూ వచ్చింది. అమ్మడి టూర్ ఇక్కడితో ఏమీ అయిపోలేదు. ఈమె షేర్ చేసిన ఫోటోల లిస్ట్ ఇంకా చాలానే ఉంది.

కోకో రెస్టారెంట్ లో ఫుడ్ - రెయిన్ ఫారెస్ట్ లో రైడ్, స్కూబా డైవింగ్, కొయ్ లాతో ఫోటో-  షాపింగ్ సందడి- రోప్ వే - రెయిన్ ఫారెస్ట్-రీఫ్ కలిసే ప్లేస్ - జంగిల్ సర్ఫింగ్ - కుకు యలాంజీ ట్రైబ్స్ తో అడవిలో ట్రిప్స్ - చివర్లో క్రూయిజ్ ట్రిప్స్.. ఇదీ పరణీతి ఆస్ట్రేలియా టూర్ విశేషాలు. ఇదంతా చదువుతుంటే.. అర్జెంటుగా ఆస్ట్రేలియా చెక్కేయాలని అనిపిస్తోంది కదూ. అందుకే అంటోంది. ఆస్ట్రేలియాకి అచ్చమైన బ్రాండ్ అంబాసిడర్ లాగా.. ఇంతగా ఆ దేశానికి ప్రచారం చేసిపెడుతున్నావేంటి అమ్మడూ అని.
Tags:    

Similar News