బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా.. చక్కగా చిక్కిపోయాక సినిమాలు తెగ స్పీడ్ గా చేసేస్తోంది. డిషూంలో జస్ట్ ఓ కేమియోతో సరిపెట్టిన ఈ బ్యూటీ.. ఇప్పుడు 'మేరీ ప్యారీ బిందు' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్ గా మూడేళ్ల తర్వాత రానున్న సినిమా కావడంతో.. ఈ బిందును పరిణీతికి రీఎంట్రీ మూవీ అనాల్సిందే.
ఈ ఏడాది మే నెలలో షూటింగ్ ప్రారంభించుకున్న మేరి ప్యారీ బిందు కోసం.. గత నెలాఖరులోనే తన వంతు పార్ట్ షూటింగ్ పూర్తి చేసేసింది పరిణీతి చోప్రా. అయితే.. ఓ ప్రమోషనల్ సాంగ్ తో పాటు.. కొన్ని సీక్వెన్స్ లు.. ప్యాచప్ వర్క్ కోసం ఆమెను మళ్లీ పిలిపించాడు నిర్మాత ఆదిత్య చోప్రా. యష్ రాజ్ ఫిలిమ్స్ లో మూవీ అన్నాక మరి ఇలాంటి వాటికి అంగీకరించక తప్పనిపరిస్థితి. అయితే.. సెట్స్ లోకి వెళ్లక ముందే అమ్మడి ముఖానికి మాస్క్ తగిలించారట యూనిట్. ఆశ్చర్యపోయి సెట్ లోకి వెళితే.. అక్కడ అందరిదీ సేమ్ సిట్యుయేషన్.
బాగు దుమ్ముకొట్టుకుపోయినట్లుగా ఓ సెట్ ని డిజైన్ చేశారట. ఎవరికీ అలర్జీలు రాకుండా ఇలా మాస్క్ లు సరఫరా చేసి మరీ షూట్ చేస్తున్నారు. 'సెట్ అంతా దుమ్మే. మొత్తం క్రూ అంతటికీ అలర్జీలు మాస్కులు ఇచ్చారు. ఈ ప్రొడక్షన్ ఎంత గ్లామర్ గా ఉందో కదా'అంటూ ట్వీట్ పెట్టింది పరిణీతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/