ఫోటో స్టోరి: సమ్మర్ హీట్ దాటేసింది

Update: 2016-04-13 09:30 GMT
పరిణీతి చోప్రా.. ఇప్పుడు బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్. స్లిమ్ లుక్ తో అదరగొట్టడమే కాదు.. అందాల ఆరబోతలో కూడా ఆరితేరి పోయింది ఈ బాలీవుడ్ సుందరి. బొద్దుగా ఉండే పర్సనాలిటీని జీరో సైజ్ కి తెచ్చేసి, నమ్మలేని రేంజ్ లో తన ఫిజిక్ ని మార్చేసుకుంది. ఇప్పుడీ బ్యూటీ.. బడా మేగజైన్ ల కవర్ పేజ్ లన్నీ కవర్ చేసేస్తోంది. రీసెంట్ మహిళల మేగజైన్ ఫెమినా కవర్ పేజ్ తర్వాత.. ఇప్పుడు మెన్స్ వరల్డ్ కవర్ పేజ్ ని కూడా ఆక్రమించేసింది పరిణీతి.

అందాల ఆరబోతలో ఏ మాత్రం కాలేదు పరిణీతి చోప్రా. అసలే మగాళ్ల మేగజైన్ కావడంతో.. వాళ్లకు ఏం ఇస్తే, ఏం చూపిస్తే ఎట్రాక్ట్ చేయచ్చో... అన్నిటినీ చూపించేందుకు ట్రై చేసింది. ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ లో చేసిన బోల్డ్ షో అయితే అదుర్స్ అనాల్సిందే. ఇర కవర్ పేజ్ పై వేసిన వైట్ కాస్ట్యూమ్ లో అయితే.. కత్తి లాంటి ఫిజిక్ ని వయ్యారంగా చూపించేసింది. మేగజైన్ లోపల ఉన్న ఫోటోల్లో అమ్మడి అందాలు.. అభిమానులకు పండగ చేసేస్తున్నాయి. అసలే సమ్మర్ కావడంతో.. ఈ అందాల వేడి తట్టుకోవడం సాధ్యం కావడం లేదంటున్నారు పరిణీతి ఫ్యాన్స్.

ప్రస్తుతం పరిణీతి చోప్రా యష్ రాజ్ బ్యానర్ లో మేరీ ప్యారీ బిందు అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో అయుష్మాన్ ఖురానాకు జంటగా నటించనుంది పరిణీతి చోప్రా. రొమాంటిక్ మూవీ గా తెరకెక్కుతున్న 'మేరీ ప్యారీ బిందు'ను అక్షయ్ రాయ్ దర్శకత్వం వహించనున్నాడు. ఓ అప్ కమింగ్ సింగర్ గా ఈ మూవీలో కనిపించనుంది పరిణీతి.
Tags:    

Similar News