లేడీ ఫ్రెండ్ తో హీరోయిన్ ఎఫైరా.. నో!!

Update: 2017-05-02 06:53 GMT
మూడు ఏళ్ళ గ్యాప్ తరవాత పరిణీతి చోప్రా ‘మేరీ ప్యారీ బిందు’ సినిమాతో వస్తోంది. ఇప్పుడు మంచి టైమ్ పాస్ కబుర్లలో పరిణీతి చోప్రా బోయ్ ఫ్రెండ్ ఎవ్వరూ అనేది అందరి నోట వినబడుతున్న టాక్. స్లిమ్ అయిన తరువాత పరిణీతి ఎంత హాటుగో ఉందో.. ఆమె చుట్టూ వచ్చే గాసిప్పులు కూడా అంతే హాటుగా ఉన్నాయి.

ఆమె లవ్ లింక్స్ గురించి ఇప్పుడు టౌన్ అంతా మాట్లాడుకుంటోంది. మొదట డైరక్టర్ మనీష్ శర్మ తో డేటింగ్ లో ఉంది అని చాలా పుకార్లు వచ్చాయి. తరువాత తన ఇష్క్జాదే హీరో అర్జున్ కపూర్ తో ఇంకా ఉదయ్ చోప్రా తో ప్రేమ నడుపుతుంది అని చాలా చోట్ల గుసగుసలు ఆడుకొంటున్నారు. మొన్నే ధర్మ ప్రొడక్షన్లో పనిచేస్తున్నఅసిస్టెంట్ డైరక్టర్ చరిత్ దేశాయ్ తో చక్కర్లు కొడుతుంది అని వార్తలు వినిపించాయి.అదే మాట  పరిణీతి చోప్రా ని అడిగితే ఏమి చెప్పిందో తెలుసా...

''నేను నా ఫ్రెండ్ సంజనా దుబాయి నుండి తిరుగి వచ్చాక ఇక్కడ పుకార్లు విని నాకు పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వొచ్చింది. ఎందుకంటే అంత లిస్ట్ ఎవ్వరూ ప్రిపేర్ చేశారో తెలియదు కానీ సినిమాలు తీస్తున్న వాళ్ళిని కొత్త వారిని కూడా లిస్ట్ లో ఎలా పెట్టారు? అంతేకాదు.. అసలు నేను సంజన కూడా రిలేషన్లో ఉన్నాం అంటూ రాశారు. వామ్మో!! మీరు లవ్ లింక్లు పెట్టిన వారు అందరూ నా జీవితంలో  ఉన్నారు. వాళ్ళతో నాకు మంచి అనుబంధం ఉంది. కాని ఎఫైర్స్ లేవు'' అంటూ చెప్పేసి వెళ్ళిపోయింది.

మొత్తానికి ఈరోజుల్లో సింగిల్ గా ఒక అమ్మాయితో ఎక్కడికైనా టూర్ కు వెళితే.. ఆ హీరోయిన్ కు వెంటనే లెస్బియన్ రిలేషన్ కూడా అంటగట్టేస్తున్నరనమాట. పాపం పరిణీతి!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News