కాస్మో అందాలు చూస్కో అంటోంది

Update: 2017-04-09 08:28 GMT
బబ్లీ అందాల బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ఎప్పటికప్పుడు కొత్త లుక్స్ తో భలే రెచ్చిపోతోంది. భారీ సైజ్ నుంచి నాజుకు సుందరిగా మారిపోయిన ఈ భామ.. ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్స్ తో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తూనే ఉంది.

తాజాగా కాస్మోపాటిలన్ మేగజైన్ కవర్ పోజ్ కోసం పరిణీతి ఇచ్చిన అందాల పోజ్ అందరి కళ్లకు మెరుపులు అద్దుతోంది. నీలం రంగులో రఫిల్ బ్లౌజ్ ధరించి.. క్లీవేజ్ ఒంపులను ఒయ్యారంగా చూపించేస్తోంది ఈ భామ. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న జాకార్డ్ స్కర్ట్ అమ్మడి కొలతలు ఓ స్థాయిలో మారిపోయాయనే విషయాన్ని స్పష్టంగా చూపించేస్తోంది. రెడ్ లిప్ స్టిక్ వేసిన పెదాలతో.. పరిణీతి నవ్వుతుంటే.. కళ్లలోని మెరుపులు ఎందరినో దాసోహం అనిపించేయడం ఖాయం. తను సహజంగా తీర్చిదిద్దుకున్న అందాలను మరింత స్పష్టంగా చూపించడం కోసం.. మరింకే ఆభరణాలను ఉపయోగించకుండా.. స్వచ్ఛమైన మెరుపులను చూస్కోమంటోంది పరిణీతి చోప్రా.

గతంలో తాను తెగ తినేసేదాన్నని.. ఎమోషనల్ ఈటర్ ను అంటూ అప్పుడు ఎందుకు లావుగా ఉండేదో కూడా చెప్పిన పరిణీతి.. ఈ మేగజైన్ కోసం.. తాను సన్నబడేందుకు కష్టపడిందో పూసగుచ్చినట్లు వివరించేసింది. ప్రస్తుతం మేరీ ప్యారీ బిందు మూవీ షూటింగ్ పూర్తి  చేసిన పరిణీతి చోప్రా.. గోల్ మాల్ ఎగైన్ లో నటించేస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News