తాగేసి అందరికీ ముద్దులు పెట్టిన హీరోయిన్

Update: 2017-08-18 11:25 GMT
హీరోయిన్లు తమకున్న చెడ్డ అలవాట్ల గురించి బయటికి చెప్పుకోరు. సినీ పరిశ్రమలో ఉన్న అమ్మాయిలకు మద్యం అలవాటు కామన్ అంటుంటారు కానీ.. దాని గురించి ఎవరూ ఓపెన్ గా మాట్లాడరు. ఐతే ‘నో ఫిల్టర్ నేహా’ పేరుతో నేహా ధూపియా నిర్వహించే టాక్ షోలో పాల్గొన్న బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా మాత్రం తనకున్న తాగుడు అలవాటు గురించి.. ఒక పార్టీలో తాను తప్ప తాగి చేసిన అల్లరి గురించి ఓపెన్ గా మాట్లాడేసింది.

బేసిగ్గా ఈ కార్యక్రమం ఉద్దేశమే అది. అన్ని విషయాలూ ఓపెన్ గా చెప్పాలి. తనది.. తన ఫ్రెండ్ సానియా మీర్జాది సేమ్ బ్రెస్ట్స్ అంటూ సానియా అన్న మాటల గురించి పరిణీతి రివీల్ చేసింది కూడా ఈ షోలోనే. దీంతో పాటుగా తన తాగుడు వ్యవహారానికి సంబంధించి కూడా ఓ ఉదంతాన్ని పంచుకుందామె. ఒక రోజు రాత్ర ముంబయిలో పెద్ద పార్టీ జరిగిందని.. రాత్రి 12 గంటలకు అందరూ వెళ్లిపోయారని.. ఐతే తాను.. ఆలియా భట్.. వరుణ్ ధావన్.. ఆదిత్య రాయ్ కపూర్ మాత్రం మిగిలామని.. వాళ్లందరూ తనను తాగమని బలవంతం చేశారని.. దీంతో తప్పక తాగేశానని పరిణీతి చెప్పింది.

తనకు బాగా ఎక్కేయడంతో ఏం చేస్తున్నాననో అర్థం కాని పరిస్థితికి చేరుకున్నానని.. ఉదయం 6 గంటల వరకు డ్యాన్స్ చేస్తూనే ఉన్నానని.. లాబీలోకి వెళ్లిపోయి కనిపించిన ప్రతి ఒక్కరికీ ముద్దులు కూడా పెట్టేశానని.. ఇదంతా తనకు మత్తు వదిలిన తర్వాత తెలిసిందని పరిణీతి చెప్పింది. తాను మద్యం తాగడం అదే తొలిసారని పరిణీతి చెప్పడం విశేషం.
Tags:    

Similar News