శోభ‌న్‌ బాబు అవార్డ్స్‌.. పెద్దాయ‌న‌ అక్షింత‌లు!

Update: 2018-11-04 06:37 GMT
అవార్డ్ కార్య‌క్ర‌మాలంటే ఇలా ప్రారంభించి అలా మ‌ధ్య‌లో వ‌దిలేసే వ్య‌వ‌హారం కాదు. కొంద‌రు ఆర్భాటంగా అవార్డు వేడుక‌లు ప్రారంభించి మ‌ధ్య‌లోనే వ‌దిలేస్తుంటారు. దాని వ‌ల్ల అప‌హాస్యం పాల‌వ్వాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. ఏ న‌టుడు/ సెల‌బ్రిటీ పేరు మీద అయితే అవార్డులు ప్రారంభిస్తారో చివ‌రికి ఆ న‌టుడి ప‌రువు తీస్తున్నారు. అలాంటి సంద‌ర్భాలు స‌రికాద‌ని అంటున్నారు 400 సినిమాల లెజెండ‌రీ ర‌చ‌యిత‌ ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు. శోభ‌న్ బాబు అవార్డు వేడుక‌లు 2018 సాక్షిగా ప‌రుచూరి అవార్డు వేడుక‌ల నిర్వాహ‌కుల‌పై త‌న‌దైన శైలిలో చెణుకులు వేశారు. అవార్డులు ఒక సంవ‌త్స‌రం ఇస్తారు. ఇంకో సంవ‌త్స‌రం ఇవ్వ‌రు. చేస్తే ప‌ద్ధ‌తిగా చేయాలి. కొంద‌రు చేయ‌లేక వ‌దిలేస్తున్నారు. అది క‌రెక్ట్ కాదు.. ఇప్పుడు మీరు జాగ్ర‌త్త‌గా చేయండి.. శోభ‌న్‌ బాబు పేరు మీద ప‌ద్ధ‌తిగా అవార్డులు ఇవ్వండి. నేను - మా సోద‌రుడు దీనికి సాయం చేస్తాం. ఎక్కువ‌కాలం నిలిచేలా అవార్డులు చేయండి.. అని అన్నారు.

శ‌నివారం సాయంత్రం హైద‌రాబాద్ ద‌స‌ప‌ల్లాలో జ‌రిగ‌న `అఖిల భార‌త శోభ‌న్ బాబు సేవా స‌మితి- శోభ‌న్ బాబు అవార్డ్స్ 2018` కర్టెన్‌ రైజ‌ర్ కార్య‌క్ర‌మంలో ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ అవార్డులు నిర్వ‌హించేవాళ్ల వాల‌కం ఏమంత బాలేద‌ని - ప‌రువు పోకుండా .. నిరాటంకంగా ఈ వేడుక‌ల్ని సాగించాల్సి ఉంటుంద‌ని - శోభ‌న్ బాబు అవార్డు నాకొస్తే బావుండు అన్న‌ట్టు అవార్డుల కార్య‌క్ర‌మం ఉండాలి. డ‌బ్బు ఇవ్వ‌డం ఎంత అన్న‌ది కాదు.. ఎంత బాగా చేశారు అన్న‌ది ముఖ్యం.. అని అవార్డు క‌ర్త‌ల‌కు సూచించారు.  పరుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ-``శోభ‌న్ బాబుతో 13 స‌నిమాలు చేశాం. మాన‌వుడు మ‌హ‌నీయుడు నుంచీ అనుబంధం ఉంది. ఆయ‌న సినిమాలు మానేసేప్ప‌డు `స‌ర్ప‌యాగం` చిత్రానికి ప‌ని చేశాం. వేరొక చిత్రం చేశాం. రెండు సినిమాలు పెద్ద‌ హిట్ట‌య్యాయి. నేను రిటైర్ అయ్యే టైమ్‌ లో నాకు గౌర‌వాన్నిచ్చే రెండు సినిమాలు చేశారు.. మీకు మ‌రో సినిమా ఇస్తాను ఫ్రీగా చేసుకోండి అన్నారు. కానీ మేం చేయ‌లేదు. బ‌తికి ఉంటే ఇప్పుడైనా సినిమా చేసేవాళ్లం. చేసినా చేయ‌క‌పోయినా ఆయ‌న మా మ‌న‌సుల్లో స్థిరంగా నిలిచారు`` అని తెలిపారు.

``ప‌రుచూరి ర‌ఘుబాబు మెమోరియ‌ల్ ట్ర‌స్ట్ పేరుతో అవార్డు కార్య‌క్ర‌మాల‌కు 29 సంవ‌త్స‌రాల్లో 18ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశాను. అంద‌రికి వెండి ప‌ళ్లాలు - గ్లాసులు అందిస్తున్నాం.. దానికి కావాల్సిన మౌళిక స‌దుపాయాలు.. ఏర్పాటు చేశాం. ఈ ట్ర‌స్ట్ కోసం గుంటూరు - కృష్ణా జిల్లాల్లో కొంత భూమి కొన్నాం. కోటి 20ల‌క్ష‌లు పెట్టి థియేట‌ర్ కూడా క‌ట్టాం.. ల‌క్ష‌ల్లో ఫిక్స్‌ డ్ డిపాజిట్ చేసి వ‌డ్డీల‌తో అవార్డులు న‌డిపిస్తున్నాం. నాట‌కం వృద్ధి కోసం కోటిన్న‌ర పెట్టి ఇండివిడ్యువ‌ల్స్ థియేట‌ర్‌ ని క‌ట్టడం అన్న‌ది ఇండియా హిస్ట‌రీలో లేదు. అమ్మా నాన్న‌ల పేరుతో మ‌రో థియేట‌ర్ క‌ట్ట‌బోతున్నాం.. అన్నిచోట్లా ఉచితంగా పెళ్లిళ్లు చేసుకోవ‌చ్చు. క‌రెంటు బిల్లు క‌డితే చాలు`` అని తెలిపారు. శోభ‌న్ బాబు మ‌ర‌ణించి ఈ ఏడాదితో ప‌దేళ్లు పూర్త‌యింది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View


Tags:    

Similar News