విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్ గా నిలబెట్టిన చిత్రం అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో 2018 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామా సెన్షేషనల్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్ గా షాలిని పాండే నటించిన విషయం తెల్సిందే. విజయ్ దేవరకొండ మరియు షాలిని పాండే కాంబో రొమాంటిక్ సన్నివేశాలు మరియు ముద్దు సీన్స్ అప్పట్లో సెన్షేషనల్ అయ్యాయి. తెలుగులోనే కాకుండా హిందీ మరియు తమిళంలో కూడా ఈ సినిమా రీమేక్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాంటి అర్జున్ రెడ్డి సినిమా లో హీరోయిన్ గా ఛాన్స్ వస్తే పలువురు నో చెప్పారు. ఆ విషయాన్ని గతంలో దర్శకుడు సందీప్ చెప్పుకొచ్చాడు.
హీరోయిన్ గా పలువురిని సంప్రదించిన సమయంలో ముద్దు సీన్స్.. శృతిమించిన రొమాంటిక్ సీన్స్ ఉన్నాయనే ఉద్దేశ్యంతో నో చెప్పారట. అర్జున్ రెడ్డితో రొమాన్స్ కు నో చెప్పిన వారిలో మలయాళి ముద్దుగుమ్మ పార్వతి నాయర్ కూడా ఒకరు అంటూ తాజాగా వెళ్లడయ్యింది. తాజాగా ఆమె స్వయంగా తాను అర్జున్ రెడ్డి సినిమాలో నటించే అవకాశం వచ్చినా కూడా నో చెప్పాను అంటూ చెప్పుకొచ్చింది. మలయాళంతో పాటు ప్రస్తుతం సౌత్ లో బిజీ అండ్ మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ పార్వతి నాయర్.
ఈమె తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఆ సమయంలో అర్జున్ రెడ్డి సినిమాలో నటించే అవకాశం వస్తే మీరు కాదన్నారట కారణం ఏంటీ అంటూ ఒక అభిమాని ప్రశ్నించగా... ఔను నన్ను అర్జున్ రెడ్డి సినిమాకు అడిగారు. అదో మంచి సినిమా. నేను ఆ సినిమాను మిస్ అయ్యాను. అయితే సినిమాలో రొమాంటిక్ సన్నివేశాల కారణంగా నేను సినిమాకు నో చెప్పాను అంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే మనకు ఏది దక్కుతుందో దాంతో సంతృప్తి పడాల్సిందే. నేను ఆ సినిమాను చేయలేక పోయాను అని బాధ పడను. అలాంటి ఆఫర్ మరో రూపంలో వస్తుందని నమ్ముతాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది.