ఇటీవలి కాలంలో మనోభావాలు దెబ్బ తినడంతో పాటు బహిష్కరణ ధోరణి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోలకు కంటిమీద కునుకుపట్టనివ్వని వెపన్ లా మారింది ఈ ధోరణి. ఇది కేవలం సోషల్ మీడియా ఆయుధం .. ఏం చేస్తుంది? అనుకుంటే గ్రహపాటేనని పలువురు హీరోల అనుభవాలు చెబుతున్నాయి.
మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్.. ఖిలాడీ అక్షయ్ కుమార్..అజయ్ దేవగన్.. కండల హీరో సల్మాన్ ఖాన్.. ఎనర్జిటిక్ హీరో రణవీర్ సింగ్.. పద్మావత్ దీపిక పదుకొనే ఇలా పెద్ద స్టార్లంతా బహిష్కరణ ధోరణికి హడలెత్తారు. ఏదో ఒక సందర్భంలో వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియా ఎదుట దొరికిపోయారు వీరంతా. దానికి వారు నటించిన సినిమాలు మూల్యం చెల్లించాయి. భారీ డిజాస్టర్లను ఎదుర్కొన్నారు. గడిచిన సంవత్సరమంతా బహిష్కరణ ధోరణి గురించి విస్త్రతంగా చర్చ సాగింది.
అమీర్ నటించిన లాల్ సింగ్ చడ్డాను ఫ్లాప్ గా మార్చింది ఈ ధోరణి. నిజానికి సినిమా నెగెటివ్ రివ్యూల కంటే బహిష్కరణ ధోరణి తీవ్రంగా పని చేసిందని విశ్లేషించారు. బాలీవుడ్ ఇన్ సైడర్.. ఔట్ సైడర్ టాపిక్ కూడా పెను ప్రకంపనంగా మారింది. బాలీవుడ్ లో బాలీవుడ్ హీరోలను తగ్గించి సౌత్ హీరోలను పెంచడం వెనక కూడా గమ్మత్తయిన మ్యాజిక్ పని చేస్తోందని విశ్లేషించాలి. బాలీవుడ్ ఔట్ సైడర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత పెద్ద హీరోలకు నెటిజనులు గుణపాఠం చెబుతున్నారు. మాఫియాకు ఎదురెళుతూ సినిమాల్ని ఫ్లాపులుగా మార్చేస్తున్నారు.
కారణం ఏదైనా కానీ ఇప్పుడు భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న `పఠాన్` విషయంలో ఏం జరగబోతోందోనని టెన్షన్ తో ఉన్న కింగ్ ఖాన్ కొద్దిరోజులుగా పూర్తి అటెన్షన్ తో ఉన్నాడు. అనవసర హంగామాకి పోకుండా పూర్తిగా డౌన్ టు ఎర్త్ ఉంటున్నాడు. ఇటు సౌత్ సినిమాలను తనవంతుగా పొగిడేస్తున్నాడు. సౌత్ ట్యాలెంటుతో ప్రయోగాలు చేస్తున్నాడు. అంతేకాదు.. పఠాన్ ని పెద్ద సక్సెస్ చేసే వరకూ ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు.
సౌత్ నార్త్ విభేధాలకు తావివ్వకుండా.. బహిష్కరణ ధోరణికి ఆస్కారం కల్పించకుండా సైలెన్స్ ను మెయింటెయిన్ చేస్తున్నాడు. సైలెంటుగా దృశ్యం 2 తరహా విజయం సాధించేందుకు పఠాన్ ప్రమోషన్స్ ని వ్యూహాత్మకంగా హైడ్ లో ఉంచాడని టాక్ వినిపిస్తోంది. అనవసరంగా మీడియా మీట్ లు ఇంటర్వ్యూల జోలికి వెళ్లడం లేదు. ఏదో ఒక అనవసర వివాదాన్ని నెత్తికెత్తుకునేందుకు అతడు సిద్ధంగా లేడు. అందుకే ఇటీవల మౌనంగా ఉంటున్నాడు. దానికి కారణం పఠాన్ విజయం ఒక్కటే అతడి లక్ష్యం. జీరో లాంటి డిజాస్టర్ తర్వాత తిరిగి కంబ్యాక్ కోసం తపిస్తూ అనవసరంగా ఎవరిలోను నెగెటివిటీ పెంచే కారకాలకు దూరంగా ఉంటున్నాడు.
షారుఖ్ ఖాన్- దీపిక పదుకొనే- జాన్ అబ్రహాం ప్రధాన తారాగణంగా తెరకెక్కిన తాజా చిత్రం `పఠాన్` వచ్చే వారం రిపబ్లిక్ డే ట్రీట్ గా విడుదల కానుంది. ఇంతలోనే దీపిక కాషాయ బికినీ వివాదం పఠాన్ టీమ్ లో గుబులు రేపింది. దీంతో ఖాన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మీడియాకి ఖాన్ దూరంగా మసులుకుంటున్నాడు. అతడు ఆశించినట్టే పఠాన్ ఘనవిజయం సాధిస్తుందనే ఆకాంక్షిద్దాం. ఒక పెద్ద విజయంతో అతడు మీడియా ఎదుట సక్సెస్ మీట్ లో మాట్లాడితే సరిపోతుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.