500 కోట్ల క్లబ్: బాహుబలి 2 34రోజులు.. పఠాన్ 22 రోజులు
షారూఖ్ ఖాన్ 'పఠాన్' మూడు వారాల పాటు బాక్సాఫీస్ వద్ద బలమైన పట్టును కొనసాగించింది. 23వ రోజున ఈ చిత్రం దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ. 3.50 కోట్లు రాబట్టిందని పరిశ్రమ ట్రాకర్ సక్నిల్క్ తెలిపింది.
ఈ చిత్రం దేశీయ వసూళ్లు ఇప్పుడు రూ. 505.85 కోట్ల నెట్ (1000 కోట్ల గ్రాస్) అని సదరు ప్రచురణ పేర్కొంది. 22వ రోజు ముగిసే సమయానికి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 970 కోట్లు వసూలు చేసిందని.. బాక్సాఫీస్ వద్ద రూ. 500 కోట్ల నెట్ ను క్రాస్ చేసిన మొదటి హిందీ చిత్రంగా నిలిచిందని YRF పేర్కొంది. ఇందులో కింగ్ ఖాన్ సహా దీపికా పదుకొణె- జాన్ అబ్రహం తదితరులు నటించారు.
అయితే ఈ వారాంతంలో షెహజాదా - యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమేనియాతో పోటీని ఎదుర్కొంటుంది కాబట్టి పఠాన్ కి ఇకపై వసూళ్లు ఘనంగా తగ్గిపోనున్నాయని దాదాపు ఇది ముగింపు అని విశ్లేషిస్తున్నారు. ఇప్పటివరకు భారతదేశంలో అతిపెద్ద సంచలనం ఏది? అంటే నేటికీ బాహుబలి 2 రికార్డుల్లో నం.1 స్థానంలో కొనసాగుతోంది.
SS రాజమౌళి బాహుబలి 2 హిందీ డబ్బింగ్ వెర్షన్ రూ. 515 కోట్లు సంపాదించింది. పఠాన్ ఈ స్థానాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే వైఆర్.ఎఫ్ చిత్రం దానిని సాధించడంలో విజయం సాధిస్తుందో లేదో చూడాలి. శుక్రవారం నాటికి పఠాన్ టిక్కెట్లు రూ. 110 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది. అయినా పోటీబరిలో రెండు కొత్త సినిమాలు ఉండడంతో ఇక పఠాన్ కథ ముగిసినట్టేనని కూడా గుసగుస వినిపిస్తోంది.
నాలుగు సంవత్సరాల తర్వాత షారుఖ్ కి తిరిగి ఘనమైన కంబ్యాక్ ఇచ్చిన చిత్రం పఠాన్. తన పునరాగమనం గురించి మాట్లాడుతూ SRK ఒక ఈవెంట్ లో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ కంబ్యాక్ ఆనందంగా ఉందని సినిమా పూర్తి చేయాలనే తొందర నాకు లేదని అన్నారు.
ప్రజలకు ఆనందాన్నిచ్చే వినోదాత్మక సినిమాలు తీయాలనేది నా కోరిక. నేను అలా చేయడంలో విఫలమైనప్పుడల్లా నా అంత చెడ్డవాడు ఇంకెవరూ ఉండరు. నేను ఆనందాన్ని పంచగలిగాను. ముఖ్యంగా నా హృదయానికి దగ్గరగా ఉన్న ఆదిత్య చోప్రా - సిద్ధార్థ్ లకు నేను చాలా సంతోషం ఇవ్వగలిగానని తృప్తిగా ఉన్నాను! అని అన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.