కొంత మందికి వారసత్వం కారణంగా అలవోకగానే అదృష్టం కలిసి వస్తుంటుంది. కానీ కొంత మంది ఎంత శ్రమించినా అదృష్టం తలుపుతట్టదు. ఇలాంటి వాళ్లని దురదృష్టవంతులు అంటుంటాం. టాలీవుడ్ లో వున్న ఓ యంగ్ హీరో ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాడు. అతను మెగా ఫ్యామిలీ బంధువు కావడం పలువురికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వివరాల్లోకి వెళితే.. మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి నుంచి పంజా వైష్ణవ్ తేజ్ వరకు డజను మంది హీరోలున్నారు.
ఇందులో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్స్ గా స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ వంటి తదితర హీరోలు ఇప్పుడిప్పుడే స్టార్ స్టేటస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ విజయాల కోసం ఎదురుచూస్తున్నారు. మెగా స్టార్ ఫ్యామిలీ నుంచి అల్లూ వారి హీరోల వరకు ఇప్పటి వరకు మెగా వారి హీరోల సంఖ్య దాదాపుగా 12కు చేరింది.
త్వరలో అకీరా ఎంట్రీ ఇస్తే ఈ లెక్క మారుతుంది. ఇదిలా వుంటే ఈ మెగా ప్యామిలీలోనూ ఓ దురదృష్టవంతుడైన యంగ్ హీరో వున్నాడు. అతనే పవన్ తేజ్. మెగా ఫ్యామిలీ కాకపోయినా ఈ ఫ్యామిలీకి దూరపు బంధువు. చిరంజీవి తన తండ్రికి బంధువు అని ఇటీవల తన తొలి సినిమా సందర్భంలో వెల్లడించడంతో ఇతన్ని కూడా మెగా ఫ్యామిలీ హీరో కింద జమ చేస్తున్నారు. పవన్ తేజ్ హీరోగా ఎంట్రకీ ఇచ్చిన చిత్రం `ఈ కథలో పాత్రలు కల్పితం`. ఈ సినిమా విషయంలో మెగా హీరోల నుంచి పవన్ తేజ్ కు సపోర్ట్ లభించలేదు. దీంతో ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలింది.
అయితే సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న పవన్ తేజ్ కు ఊహించకుండానే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి చేసిన `ఆచార్య` చిత్రంలో నటించే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఇందులో విచిత్రం ఏంటంటే పవన్ తేజ్ ది గుర్తించదగిన పాత్ర. విలన్ బ్యాచ్ లో పవన్ తేజ్ ఒకడిగా కనిపించాడు. అయితే ఈ సినిమాతో తనకు గుర్తింపు లభిస్తుందని ఆశపడితే అతని ఆశ అడియాశగా మారింది.
ఇటీవల విడుదలైన `ఆచార్య` అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో పవన్ ఈ సినిమా పై పెట్టుకున్న నమ్మకం వమ్మైపోయింది. ఎలాగైనా ఈ సినిమాతో మంచి గుర్తింపుని సొంతం చేసుకోవాలని భారీ అంచనాలు పెట్టుకుంటే అవన్నింటినీ `ఆచార్య` ఒక్కసారిగా తలకిందులు చేసింది. స్టార్ డైరెక్టర్ కొరటాల డైరెక్షన్ లో చిరు, చరణ్ లాంటి స్టార్స్ నటించినా పెద్దగా ఫలితం లేకుండా పోవడంతో పవన్ తేజ్ నిజంగా దురదృష్టవంతుడే అంటున్నారు సినీ జనం.