మా అధ్యక్షుడిగా ఎన్నిక అయిన మంచు విష్ణు తన ప్యానల్ తో కలిసి నేడు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వారితో పాటు మంచు లక్ష్మి కూడా ఉన్నారు. అక్క మంచు లక్ష్మితో పాటు గెలుపొందిన ప్యానల్ మెంబర్స్ అంతా కలిసి దైవ దర్శణం చేసుకున్న తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఆ సమయంలో మా భవనంతో పాటు పలు విషయాలపై స్పందించారు. మూడు నెలల్లో మా భవనంపై ఒక స్పష్టత ఇస్తాను అంటూ మంచు విష్ణు ప్రకటించాడు. ఇచ్చిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తానంటూ మరోసారి స్పష్టతనిచ్చాడు. ఇక నిన్న జరిగిన అలాయ్ బలాయ్ లో పవన్ కళ్యాణ్ ను స్వయంగా వెళ్లి మంచు విష్ణు పలకరించినా కూడా పట్టించుకోలేదని.. ఆయన పట్టించుకోక పోవడంతో మంచు విష్ణు కూడా కాస్త ఇబ్బంది ఫీల్ అయ్యాడు అంటూ చాలా మంది చాలా రకాలుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోల గురించి ఇండైరెక్ట్ గా మంచు ఫ్యామిలీ చేసిన వ్యాఖ్యలకు ఇది సరైన సమాధానం అంటూ పవన్ మౌనంను పలువురు అభినందించారు. పవన్ మరియు విష్ణు లు చాలా సమయం పక్క పక్కనే కూర్చున్నా కూడా కనీసం మాట్లాడింది లేదు అంటూ కొందరు ప్రత్యక్షంగా చూసిన వారు చెప్పారు అంటూ మీడియా కథనాలు వస్తున్నాయి. మంచు విష్ణు కు ఇది సరైన సమాధానం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్న ఈ సమయంలో ఆ విషయంపై స్పందించారు. మంచు లక్ష్మి మరియు విష్ణు లు ఇద్దరు కూడా ఆ విషయం గురించి మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ మరియు విష్ణు లు అలాయ్ బలాయ్ లో మాట్లాడుకోలేదు అంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలు నిజం కాదు. ఒక ఫొటోను పట్టుకుని పదే పదే చూపిస్తూ ఎడమొహం పెడమొహం అన్నట్లుగా రాయడం సబబు కాదు అంటూ మంచు లక్ష్మి అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇద్దరు కూడా చాలా సేపు మాట్లాడుకున్నారు.. పలు విషయాలు వారి మద్య చర్చకు వచ్చాయి అంది. మంచు విష్ణు కూడా మేము చాలా సమయం మాట్లాడుకున్నాం. ఆ ఫొటో గురించి వస్తున్న వార్తలు నిజం కాదంటూ క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి ఈ విషయమై మంచు వారు క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు గుసగుసలాడుకుంటున్నారు.