పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'వకీల్ సాబ్' సినిమా థియేట్రికల్ ట్రైలర్ సోమవారం(మార్చి 29) సాయంత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా మేకర్స్ ముందుగా ఈ ట్రైలర్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లలో ప్రదర్శించారు. దీంతో 'వకీల్ సాబ్' ఫీవర్ తో ఊగిపోతున్న పవన్ ఫ్యాన్స్.. థియేటర్లకు పోటెత్తారు. మూడేళ్ళ తర్వాత తమ అభిమాన హీరోని వెండితెరపై చూస్తున్నామనే ఆనందంతో థియేటర్ల వద్ద హంగామా చేశారు. అయితే కొన్ని కొన్నిచోట్ల అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి.
'వకీల్ సాబ్' ట్రైలర్ థియేటర్లలో వీక్షించే అవకాశం రావడంతో వేలాదిగా అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు. చాలా చోట్ల ఫ్యాన్స్ ని అదుపు చేయలేక సెక్యూరిటీ సిబ్బంది చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలోని సంగం శరత్ థియేటర్ అద్దాలు పగలుకొట్టి మరీ పవన్ అభిమానులు లోపలికి దూసుకెళ్లారు. దీంతో అక్కడ తోపులాట జరగడంతో కొందరు కింద పడిపోగా, వారిని తొక్కుకుంటూ థియేటర్ లోపలికి పరిగెత్తడం కనిపించింది. అలానే విజయవాడలోని అప్సర థియేటర్ సీట్లను కూడా ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం థియేటర్ల వద్ద పవన్ ఫ్యాన్స్ చేసిన రచ్చకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా.. జాతీయ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారాయి.
'పవన్ ఫ్యాన్స్ సైతం ఈ వీడియోలను ట్విట్టర్ లో షేర్ చేస్తూ గొప్పగా చెప్పుకోవడం గమనార్హం. 'కేవలం ట్రైలర్ కే అద్దాలు పగలకొట్టేస్తే.. రేపు సినిమా రిలీజ్ కు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. చాలా ఆకలి మీదున్నామండి' అంటూ పవన్ ఫ్యాన్ ఒకరు ట్వీట్ చేసాడు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సామాజిక దూరం పాటించకుండా ఇలాంటి పబ్లిక్ గ్యాదరింగ్స్ చేయడమే తప్పు అంటుంటే.. ఇలా అద్దాలు పగలగొట్టడం, సీట్లు ధ్వంసం చేయడమేంటని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలలో ఏదైనా జరగరానిది జరిగితే అది చివరకు పవన్ కళ్యాణ్ కే చెడ్డ పేరు తీసుకొస్తుందని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.
Full View Full View Full View