సాయితేజ్ హీరోగా చేసిన 'రిపబ్లిక్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ ముఖ్య అతిథిగా వచ్చారు. తనదైన స్టైల్లో వేదికపై సందడి చేశారు. "సినిమా ఇండస్ట్రీ బాగుకోరే వాళ్లలో నేను ఒకడిని. నా నిర్మాతలు నష్టపోయినప్పుడు నేను డబ్బులు వదిలేసుకున్నాను. ఎక్కడో మారుమూల గ్రామంలో తనని ఎవరూ గుర్తించడం లేదనే బాధలో ఉన్న కిన్నెర మొగిలయ్యను గుర్తించాను. అది నా సంస్కారం. మేము చేసిన సాయాలు కూడా చూడండి. అక్రమ ఆర్జిత రాజకీయనాయకులపై మీ దృష్టి పెట్టండి .. సినిమా వాళ్లపై కాదు.
ఒక వ్యాపారం చేసేవాడు తన వ్యాపారాన్ని పెంచుకోవాలనే అనుకున్నాడు .. అందులో తప్పేముంది? దిల్ రాజులాంటివారికి మాత్రమే థియేటర్లు ఉన్నాయనుకుంటే, ఆర్ధికంగా వెనుకబడినవారికి సాయం చేసి .. థియేటర్లు కట్టుకోవడానికి స్థలాలు ఇవ్వండి. అవి మానేసి మీకు డబ్బులు వద్దు .. మాకు డబ్బులు వద్దంటారు. జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుతుంది. వెల్త్ క్రియేషన్ జరగాలి .. అది లేకపోతే మొగిలయ్యకు నేను రెండున్నర లక్షలు ఇవ్వగలనా? సైనిక బోర్డుకు కోటి రూపాయలు ఇవ్వగలనా? కరోనా నిధికి రెండు కోట్ల రూపాయలు ఇవ్వగలనా?ఇలాంటివి చేయాలంటే డబ్బులు సంపాదించాలి గదా!
వాడికి వంగి .. వీడికి వంగి జీవితంలో విసిగిపోయాను. మీరేమో పవర్ స్టార్ అంటారు .. వాళ్లేమో చావదొబ్బుతూ ఉంటారు .. నా పేరు చెప్పి సినిమా ఇండస్ట్రీని చావదొబ్బుతున్నారు. "దిల్ రాజుగారు ఎందుకండీ మీరు మాతో 'వకీల్ సాబ్' తీశారు. మీరు నాతో సినిమా తీయకుండా ఉంటే ఈ పాటికి ఆంధ్రాలో సినిమాలు రిలీజ్ అయ్యుండేవి. మీరూ రెడ్డీ .. వాళ్లూ రెడ్డే కదా .. రెడ్డీ రెడ్డీ తేల్చుకోండి. ఈ రోజు నుంచి దిల్ రాజును దిల్ రాజ్ రెడ్డి అంటే జగన్ రెడ్డి గారికి కూడా కొంచెం మజాక్ వస్తుందేమో"
పవన్ అలా మాట్లాడుతూ ఉండటంతో ఆడిటోరియంలో అంతా నవ్వులతో హోరెత్తిపోయింది. చాలామంది చప్పట్లు కొడుతూ తమ హర్షాన్ని ప్రకటించారు. అదే సమయంలో ఒక అభిమాని స్టేజ్ పైకి చేరుకుని పవన్ వైపుకు పరిగెత్తుకుని వచ్చాడు. పవన్ ను ఆలింగనం చేసుకోవడానికి ప్రయత్నించాడు. దాంతో ఒక్కసారిగా పవన్ సీరియస్ అయ్యారు. తన దగ్గరికి వచ్చిన అభిమానిని ఆయన చాలా వేగంగా అడ్డుకున్నారు. "ఆగు .. పక్కకెళ్లు .. వెళ్లు ఇక్కడి నుంచి ' అంటూ గట్టిగా అరిచారు. అంతలో బౌన్సర్లు ఆ యువకుడిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ఆ తరువాత పవన్ తిరిగి తన స్పీచ్ ను కొనసాగించారు.