ఏ విషయాన్నయినా దాచేకొద్దీ జనాలకు దాని మీద అంత ఆసక్తి కలుగుతుంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై జనాలకు ఎక్కువ ఆసక్తి కలగడానికి కూడా కారణం ఇదే. తన ప్రైవేట్ లైఫ్ ను పబ్లిక్ చేయడానికి పవర్ స్టార్ అస్సలు ఇష్టపడడు. పవన్ మూడో భార్య అనా లెజ్ నెవా గురించి జనాలకు తెలిసింది చాలా తక్కువ. ఆమెతో ప్రేమాయణం.. పెళ్లి వ్యవహారం అంతా చాలా రహస్యంగా సాగిపోయింది. పెళ్లి తర్వాత కూడా అనాతో కలిసి పవన్ బయట కనిపించిన సందర్భాలు అరుదు. ఎప్పుడైనా ఎయిర్ పోర్టులో ఆమెతో కలిసి వెళ్తున్నపుడో లేదంటే ఫారిన్లో కలిసి ఆమెతో ఉన్నపుడో ఒకడో రెండో ఫొటోలు లీకై సోషల్ మీడియాలోకి వచ్చాయి. అవి కూడా క్లారిటీ లేనివే. అంతే తప్ప.. పవన్-అనా కలిసి ఏదైనా కార్యక్రమానికి హాజరైన ఫొటోలు ఇప్పటిదాకా దాదాపుగా బయటికి రాలేదు.
ఐతే తొలిసారిగా ఇప్పుడు పవన్-అనా కలిసి సికింద్రాబాద్ లోని ఒక చర్చిలో ఆదివారం ఉదయం ప్రార్థనలు చేస్తూ కెమెరాలకు చిక్కారు. పవన్ కూడా ఈ ఫొటోల విషయంలో అభ్యంతరాలేమీ పెట్టినట్లుగా లేడు. సోషల్ మీడియాలో ఈ ఫొటోలిప్పుడు వైరల్ అవుతున్నాయి. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగబోతూ కరీంనగర్ లోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర్నుంచి యాత్ర చేపట్టబోతున్నట్లు పవన్ నిన్న సాయంత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. సర్వమత ప్రార్థనల అనంతరం తన యాత్ర మొదలవుతుందని.. తనను ఆశీర్వదించాలని కోరాడు పవన్. ఈ నేపథ్యంలో ముందుగా చర్చికి హాజరై ఏసు ప్రభువు వద్ద ప్రార్థనలు చేసినట్లున్నాడు పవన్. ఐతే పవన్ యాత్ర సరిగ్గా ఎప్పుడు మొదలవుతుంది.. ఎలా సాగుతుంది అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.