ప్రతీ సంవత్సరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తోటలో పండే మామిడి పండ్లను కొంత మంది సన్నిహితుల్లో తనకిష్టమైన వారికి ప్రత్యేకంగా ప్యాక్ చేసి పంపిస్తుంటారు. యూత్ స్టార్ నితిన్...దర్శకుడు త్రివిక్రమ్ ఇంట్లో ప్రతీ ఏడాది తప్పకుండా పవన్ తోట మామిడి పండ్లు ఘుమ ఘుమలాడాల్సిందే. ఇంకా పలువురు సన్నిహితులు పీకే ప్యాక్ చేసి పంపిస్తుంటారు.
అందులో కొంత మంది స్పెషల్ గెస్ట్ లు ఉంటుంటారు. ఈ విషయాన్ని పవన్ ఏనాడు మీడియాకి చెప్పింది లేదు. అందుకున్న వారు మాత్రం ఎంతో సంతోషంగా విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అందులో కొత్త జాబితా ఉంటే వాళ్ల ఆనందానికైతే అవధులుండవ్. సాక్షాత్తు ఆ దేవుడే మామిడి పండ్లను తమ ఇంటికి పంపించిన మహా ప్రసాదంగా భావిస్తుంటారు.
ఇలా పీకే పంపించడం..అందుకున్న వారు సంబర పడటం అన్నది నిత్యకృత్యం. అయితే తాజాగా ఈ ఏడాది నుంచి పవన్ కళ్యాణ్ అతని భార్యా అన్నా లెజ్నీవా కొత్త కార్యానికి తెర తీసినట్లు తెలుస్తోంది. ఈ నెల25న క్రిస్మస్ పండుగ సందర్భంగా పవన్ ..అన్నా లెజ్నీవా పేరుతో విషెస్ తెలియజేస్తూ కొన్ని లెటర్లు..బహుమతులు తమ సన్నిహితులకు పంపిపినట్లు తెలుస్తోంది.
వాటికి సంబంధించిన లెటర్లు కొన్ని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 'అన్నా - పవన్ కళ్యాణ్' అనే సంతకం లెటరలపై ఉన్నాయి. ఈ బహుమతులను అందుకున్న వారిలో ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్‌తో కలిసి పనిచేసిన దర్శకులు ఉన్నారు. వారు తమ సోషల్ మీడియా ఖాతాలలో అదే విషయాన్ని పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
గతంలో పవన్ సోషల్ మీడియా లో కేవలం క్రిస్మస్ విషెస్ మాత్రమే తెలియజేసేవారు. కానీ ఈసారి విషెస్ తో పాటు బహుమతు లు..లేఖలు రాడయం ఆశ్చర్యకరం. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పవన్ ఇలా కొత్త పంథాకి తెర తీసారా? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే 40 రోజుల లాంగ్ షెడ్యూల్ ఒకటి పూర్తి చేసారు. పీకే కొన్ని రోజులుగా రాజకీయాలకు దూరంగ ఉంటూ వీరమల్లు షూటింగ్ లోనే బిజీగా ఉంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.