వాట్ ఏ వింత.. అవార్డ్ ఫంక్షన్ లో పవన్

Update: 2016-07-28 04:31 GMT
పవన్ కళ్యాణ్ ఏదైనా ఫంక్షన్ లో కనిపించడం అదో పెద్ద మిరకల్ అనుకోవాలి. తన సినిమా ఫంక్షన్ లకే మొహమాటంగా వచ్చి వెళ్లిపోయే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ మధ్య కొంచెం రూట్ మార్చినట్లుగా కనిపిస్తున్నాడు. రీసెంట్ గా ఓ డ్యాన్సింగ్ ఈవెంట్ కోసం యూరోప్ టూర్ వెళ్లిన పవన్.. ఇప్పుడు హైద్రాబాద్ లో ఓ మ్యూజిక్ అవార్డ్ ఫంక్షన్ కి అటెండ్ అయ్యాడు.

మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ 2015ను హైద్రాబాద్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పవన్ కూడా వచ్చాడు. రావడమే కాదు.. ప్రెస్ గ్యాలరీ దగ్గర నుంచుని ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చాడు. ఎప్పటిలాగానే తనకు నచ్చిన ఓ జీన్స్.. ఓ ఫార్మల్ షర్ట్ వేసుకుని.. ఇన్ షర్ట్ చేసుకుని బుద్ధిమంతుడిలా వచ్చేశాడు పవర్ స్టార్. తన లేటెస్ట్ మూవీ కోసం మార్చిన హెయిర్ స్టైల్ తో.. మీసకట్టుతో కొత్తగా కనిపించాడు పవర్ స్టార్.

హెయిర్ స్టైల్ విషయంలో కొంచెం ఏజ్ కనిపించేలానే జాగ్రత్త పడ్డాడు పవన్. ఇన్నాళ్లు పవన్ నెక్ట్స్ మూవీలో హెయిర్ స్టైల్ ఇదేనా కాదా.. కొత్త సినిమాలో పవన్ గెటప్ ఏంటి అనే డౌట్స్ ఉండేవి కానీ.. ఇంకో వారం రోజుల్లో షూటింగ్ స్టార్ట్ చేయనుండగా చూపించిన లుక్ కి ఫిక్స్ అయిపోవచ్చు. అన్నట్లు.. తన బెస్ట్ ఫ్రెండ్ కం ప్రొడ్యూసర్ అయిన శరత్ మరార్ ని కూడా వెంటబెట్టుకునే వచ్చాడు పవన్.
Tags:    

Similar News