పవన్ వాడకం మరీ ఈ స్థాయిలోనా?

Update: 2015-12-10 17:30 GMT
ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ ను చాలామంది వాడుకున్నారు. ముఖ్యంగా యువ కథానాయకుడు నితిన్ పవన్ ను వాడటంలో తనకెవరూ పోటీ లేరని తన సినిమాల ద్వారా చాటి చెప్పాడు. ఐతే ఇప్పుడు నితిన్ ను మించినోడు వచ్చాడు. అతనే సంపత్ నంది. తన కెరీర్లో రెండేళ్ల విలువైన సమయం పవన్ వల్ల వృథా అయిపోయినా అదేమీ మనసులో పెట్టుకోకుండా ‘బెంగాల్ టైగర్’ సినిమాలో వీలు చిక్కినపుడల్లా పవర్ స్టార్ ను ఆకాశానికెత్తేసే ప్రయత్నం చేశాడు సంపత్. రవితేజ లాంటి మాస్ హీరో అయినప్పటికీ ఏమాత్రం మొహమాట పడకుండా పవన్ రెఫరెన్సులతో హోరెత్తించేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

సినిమాలో ఫ్యూచర్ స్టార్ సిద్ధప్పగా నటించిన పృథ్వీ ఓ సన్నివేశంలో ‘‘సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ రజినీకాంత్ ను మించిన హీరో రాడనుకున్నాం. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాలేదా’’ అంటాడు. అంటే పవర్ స్టార్ సూపర్ స్టార్ కన్నా పెద్దవాడన్నది సంపత్ నంది ఫీలింగన్నమాట. సినిమాల విషయంలోనే కాదు.. పొలిటికల్ యాంగిల్లోనూ పవన్ ను ఓ రేంజిలో నిలబెట్టాడు సంపత్. ఓ సీన్లో ‘‘మొన్నటి ఎన్నికల్లో సినిమా స్టార్ ను చూసి జనాలు ఓట్లు గుద్దేయలేదా’’ అన్న డైలాగ్ వినిపిస్తుంది. పవన్ సపోర్ట్ వల్లే తెలుగుదేశం పార్టీ గెలిచిందన్న ఉద్దేశం ధ్వనించింది ఈ డైలాగులో. మరో సన్నివేశంలో ‘అత్తారింటికి దారేది’ క్లైమాక్స్ పేరడీతో పవన్ ను మరోసారి గుర్తుకు తెచ్చాడు సంపత్. మొత్తానికి ‘గబ్బర్ సింగ్-2’ విషయంలో ఏం జరిగినా పవన్ మీద తనకేమాత్రం అభిమానం తగ్గలేదని చాటుకున్నాడు సంపత్. మరి ఈ అభిమానం చూసైనా పవన్ సంపత్ కు ఛాన్సిస్తాడేమో చూడాలి.
Tags:    

Similar News