పవన్ కళ్యాణ్ సినిమాల్లో చెప్పే డైలాగుల్ని నెమరేసుకోవడంలో ఆ కిక్కే వేరబ్బా! ఆ డైలాగులు ఇలా బయటికి రాగానే... అలా పాపులర్ అయిపోతుంటాయి. అందుకే ఆడియో ఫంక్షన్ లో పవన్ ని బలవంతం చేసి మరీ డైలాగు చెప్పిస్తుంటారు అభిమానులు. అయితే ఈసారి పవన్ ఇంకా వేడుకలోకి రాక మునుపే ఓ డైలాగ్ వినిపించింది. ఆ డైలాగ్ అప్పుడే ఇంటర్నెట్ లో హోరెత్తిపోతోంది కూడా.
`ఆయన ఓన్ అవ్వాలంటే ఆయనకి ట్యూన్ అవ్వాలి లేదా ఫ్యాన్ అవ్వాలి` అనేదే ఆ డైలాగ్. మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా ఆ డైలాగ్ ని వేదికపై చెప్పి అబిమానుల్ని అలరించాడు. డైలాగ్ విని భలే ఉందని మెచ్చుకుంటున్నారు కానీ... ఇలాంటివి వస్తే పవన్ నోటి నుంచే రావాల్లేబ్బా అంటూ పవన్ ఎప్పుడెప్పుడు డైలాగ్ చెబుతాడా అని ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ లో కూడా కొన్ని డైలాగులుంటాయి. అభిమానులు కోరిక మేరకు పవన్ కూడా కొన్ని డైలాగులు చెబుతాడు కాబట్టి ఈ లెక్కన ఈ రోజు సర్దార్ డైలాగులు రెండు మూడైనా బయటికొచ్చేలా ఉన్నాయి. ఓన్ అవ్వాలంటే ట్యూన్ అవ్వాలి, లేదా ఫ్యాన్ అవ్వాలి అనే డైలాగ్ లో ప్రాసని బలంగా వాడాడు సాయిమాధవ్ బుర్రా. మామూలుగా ఆయన డైలాగుల్లో ప్రాసలు - పంచ్ లు కాకుండా కంటెంట్ తో కూడిన డైలాగులుంటాయి. కానీ ఈ సినిమా కోసం స్టైల్ ని మార్చినట్టు అర్థమవుతోంది.