మెగా పీఠం పవర్ ఎవరికో?

Update: 2018-01-23 07:17 GMT
సినిమాల విషయంలో పవన్ కళ్యాణ్ ఓ క్లారిటీ ఇచ్చేశాడు. అజ్ఞాతవాసి మూవీ తన 23వ చిత్రమే అయినా.. శంకర్ దాదా సిరీస్ ను కూడా కలిపేసి PSPK25 అంటూ ముందు నుంచి ప్రచారం చేసేలా చూశాడు. ఓ ల్యాండ్ మార్క్ ను అఛీవ్ చేసి మూవీస్ కి ముగింపు పలకాలని  భావించడంతోనే.. త్రివిక్రమ్ తో సినిమా చేసి ఉండవచ్చని భావించవచ్చు. సినిమా రంగం అంటే ఇప్పటికే ముగిసిన అధ్యాయం అని చెప్పేయడంతో.. ఇప్పుడు మెగా వారసత్వం ఎవరిది అనే క్వశ్చన్ ఆటోమేటిగ్గా రెయిజ్ అవుతుంది.

మెగాస్టార్ ఆల్రెడీ రీఎంట్రీ ఇచ్చాక ఇలాంటి ప్రశ్నకు తావు లేదని అనుకోవచ్చు కానీ.. ఇక నుంచి చిరు గతంలో మాదిరిగా సినిమాలు చేయలేకపోవచ్చు. రీఎంట్రీ కోసం కమర్షియల్ మూవీ ఎంచుకున్నా.. తన తర్వాతి సినిమాతోనే ఓ పెద్ద ప్రయోగం చేస్తుండడం బట్టే ఈ విషయం అర్ధమవుతుంది. చిరు వారసత్వాన్ని అందిపుచ్చుకున్న పవన్.. మెగా క్రేజ్ ను మరింతగా పెంచేశాడు. రెండు జనరేషన్లకు పైగా యువతరాన్ని మెగా ఫ్యాన్స్ కు జత చేసిన ఘనత పవర్ స్టార్ ది.

ఇప్పుడు మెగా ఫ్యామిలీలో నెక్ట్స్ టాప్ స్టార్ ఎవరు అన్నదే ప్రశ్న. ఈ పాయింట్ కి వస్తే.. ఇప్పుడు మెగా కుటుంబం నుంచే ఇద్దరు హీరోలు పోటీ పడుతుండడం గమనించాలి. మెగాస్టార్ తనయుడిగా రామ్ చరణ్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. చెర్రీనే తమ మెగా వారసుడు అని ఫ్యాన్స్ ఫిక్స్ అవడంలో ఆశ్చర్యమేమీ లేదు. పైగా మగధీర అంటూ హిస్టరీ క్రియేట్ చేసేసి ఆరంభంలోనే సత్తా చాటాడు. కానీ ఆ తర్వాత మాత్రం ఆ రేంజ్ ను అందుకోవడంలో వెనుకబడ్డాడు చెర్రీ. కానీ హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా  కొన్నేళ్ల క్రితం నుంచే 40 కోట్లకు షేర్ వసూళ్లను చెర్రీ రాబడుతుండడం గమనించాలి.

మరోవైపు అల్లు అర్జున్ కూడా దూసుకుపోతున్నాడు. స్టైలిష్ స్టార్ గా ఈ మెగా హీరోకు ఉన్న ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఆ మధ్యన చెప్పను బ్రదర్ అంటూ కామెంట్ చేసి.. పవన్ ఫ్యాన్స్ తో అనవసరమైన వివాదం పెట్టుకోకుండా.. ఈ పాటికే బన్నీ రేంజ్ ఇంకా పెరిగిపోయేది. అలాగే సినిమాలు చేయడంలో వైవిధ్యత ప్రదర్శిస్తూ.. అన్ని రకాల ఆడియన్స్ కు దగ్గరవుతున్నాడు అల్లు అర్జున్.

అయితే.. రామ్ చరణ్ కు పవన్ ఫ్యాన్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. బాబాయ్ పై తన గౌరవాన్ని చాటుతూనే ఉంటాడు. కాకపోతే నెమ్మదిగా సినిమాలు చేస్తుండడం చెర్రీకి కొంత డిజడ్వాంటేజ్. ఇప్పుడు పవన్ సినిమాల నుంచి తప్పుకోవడం.. ఓ రకంగా ఈ ఇద్దరు మెగా హీరోలకు కలిసొచ్చే విషయమే. కానీ ఎవరు ఎక్కువ ఈ అంశాన్ని ఉపయోగించుకుంటారు అన్న పాయింట్ కు ఆన్సర్ తెలియడానికి.. ఓ రెండుమూడేళ్లు పట్టదూ!?
Tags:    

Similar News