వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'పవర్ స్టార్' అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు వర్మపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. 'పవర్ స్టార్' సినిమా పార్టీ పెట్టి ఎన్నికల్లో ఓడిపోయిన ఓ స్టార్ హీరో కథ అని.. నిజ జీవితంలో ఎవరిని ఉద్దేశించి తీసింది కాదని.. పోలికలు ఉంటే అది యాదృచ్చికం మాత్రమే అని ఆర్జీవీ మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. కానీ ఇది పవన్ కళ్యాణ్ పై సెటైరికల్ తీస్తున్న మూవీ అని అందరికి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు ట్రైలర్ కూడా రిలీజ్ చేసాడు వర్మ. దీంట్లో ప్రవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రధాన పాత్రగా చూపించిన వర్మ అనేక విషయాలను చర్చించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తీవ్ర పదజాలంతో దూషించడంతో పాటు బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారు. దీనిపై స్పందించిన వర్మ నా ఆఫీస్ అడ్రెస్ అందరికి తెలుసని.. ఎవరైనా రావొచ్చని కామెంట్స్ చేసారు. ''పవర్ స్టార్'' ట్రైలర్ విడుదల అయినప్పటి నుంచి తనకు థ్రెట్స్ పెరిగాయని.. అయినా వాటికి భయపడేది లేదని.. ఎందుకంటే నేను వాటితోనే ఎప్పుడు జీవిస్తుంటానని.. నా స్టార్ పవర్ స్టార్ కంటే పవర్ ఫుల్. బస్తీమే సవాల్ అని సవాల్ అని.. 'పవర్ స్టార్' సినిమాను జూలై 25 మధ్యాహ్నం 11 గంటలకు విడుదల చేయనున్నానని ట్వీట్ చేసారు.
కాగా ఈ రోజులు పలువురు పవన్ కళ్యాణ్ అభిమానులు రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ పై దాడికి దిగారు. ఈ సందర్భంగా వారు అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ వర్మని బయటకి రమ్మని గొడవకు దిగారు. అంతేకాకుండా ఆఫీస్ లోని కిటికీ అద్దాలను కూడా పగులకొట్టారు. దీంతో ఆర్జీవీ కార్యాలయ సిబ్బంది వారిని అడ్డుకొని పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇక ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు వర్మ. ''జనసేన సభ్యులు అని చెప్పుకునే పీకే అభిమానులు నా కార్యాలయంపై దాడి చేశారు. వారిని నా గార్డ్స్ మరియు కాప్స్ పట్టుకొని లాకప్ లోకి విసిరివేసారు.. పవర్ స్టార్ సినిమాకి మరింత పబ్లిసిటీ ఇచ్చినందుకు నేను వారిని ముద్దు పెట్టుకొని నా ప్రేమను తెలియచేయాలనుకుంటున్నాను'' అని ట్వీట్ చేసారు.